
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 56


చిత్రీకరణలో "అఖండ "

గోవాలో అఖిల్ 'ఏజెంట్'

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది

పవన్ ను చూసుకుంటున్న నాగవంశీ

'థ్యాంక్ యు బ్రదర్' రీలిజ్ డేట్ ఫిక్స్

సాయి పల్లవి ట్రెడిషినల్ లుక్

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది
"అల ..వైకుంఠపురములో.. " సెన్సేషనల్ రికార్డ్

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్

స్టార్ కమెడియన్ వివేక్ కన్నుమూత

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్

'ఏక్ మినీ కథ' రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కు కరోనా పాజిటివ్ - కొనసాగుతున్నచికిత్స

విశ్వక్ సేన్ కొత్తసినిమా టైటిల్ రిలీజ్

ఆనందంలో అడివి శేష్

అర్జున్ కథకు 2ఏళ్లు
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు.. ఎవరి స్టైల్ వారిది..అందరి నటన ఒకేలా ఉండదు.. ఒకేలా నటించలేరు కూడా. ఇక ఇప్పుడున్న హీరోల్లో కామెడీ అయినా.. ఎమోషనల్ అయినా మనసుకు హత్తుకుపోయేలా తన సహజ నటనతో మెప్పించే హీరో ఎవరైనా వున్నారంటే అది నాని అని చెప్పొచ్చు. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజలు న్యాచురల్ స్టార్ అనే అవార్డు ఇచ్చారంటేనే అర్థంచేసుకోవచ్చు తన నటన గురించి.

చిత్రీకరణలో "అఖండ "
దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అఖండ " మూవీ రూపొందుతుంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

గోవాలో అఖిల్ 'ఏజెంట్'
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకూ లవర్ బాయ్ లా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ ఫస్ట్ లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది.

"రా "ఆఫీసర్ గా కళ్యాణ్ రామ్
లెజెండరీ యాక్టర్ నందమూరి తారకరామారావు మనవడు , నటుడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ "తొలిచూపులోనే "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "అతనొక్కడే ", "పటాస్", "118 " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నెలకొల్పి కల్యాణ్ రామ్ పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించారు. రెండు మూవీస్ కు హీరో కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకటి "రావణ్ ", మరొకటి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే చిత్రం .

'అంటే సుందరానికి' - సైలెంట్ గా స్టార్ట్ చేసిన నాని
న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలను లైన్ లో పెట్టి ప్రస్తుతం షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని పనులు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. కరోనా ప్రభావం ఎక్కువగా లేకపోతే ఈసినిమా ఏప్రిల్ 23న రిలీజ్ అయ్యేది.

"రంగస్థలం " తమిళ వెర్షన్ రిలీజ్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా"రంగస్థలం "మూవీ 2018 సంవత్సరం మార్చి 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ లో ఆది పినిశెట్టి , జగపతి బాబు , అనసూయ ముఖ్యపాత్రలలో నటించగా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
'ఐకాన్' కు మంచి స్టోరీ లైన్ ఉంది
మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈసారి పరిస్థితులు బన్నీ ఐకాన్ సినిమాకు మాత్రం కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇంతవరకూ ఆ అదృష్టానికి నోచుకోలేదు. సినిమాను అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ అప్పటినుండి ఎవరు చెప్పినా సినిమా పక్కా ఉంటుంది.. ఉంటుంది అంటున్నారే తప్పా ట్రాక్ లోకి తీసుకురావడంలేదు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఈ సినిమానే చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ.. దాన్ని పక్కన పెట్టి ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టేశాడు. ఈసినిమా తరువాత అయినా చేస్తాడనుకుంటే వెంటనే పుష్ప సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

పవన్ ను చూసుకుంటున్న నాగవంశీ
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే కదా. ఇటీవల పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాలేకపోవడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా ముందుగా నెగెటివ్ వచ్చింది. ఆ తరువాత జ్వరం, ఒళ్ళు నొప్పులు రావడంతో మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించగా పాజిటివ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. . ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్న పవన్ కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఇక పవన్ త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

'థ్యాంక్ యు బ్రదర్' రీలిజ్ డేట్ ఫిక్స్
మార్చి నెల మొత్తం సినిమాల సందడే సరిపోయింది. గత ఏడాదిలో థియేటర్స్ లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం దాదాపు మార్చిలోనే వచ్చేశాయి. ఇక ఏప్రిల్ లో కూడా చాలా సినిమాలే రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకున్నాయి కానీ.. ఈలోపు కరోనా సెకండ్ వేవ్ అంటూ కేసులు ఎక్కువవడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లలోకి రారని భావించి రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ రిలీజ్ డేట్లను చిన్న సినిమాలు వాడుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన ఏక్ మినీ కథ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా.. ఇప్పుడు మరో సినిమా కూాడా…

సాయి పల్లవి ట్రెడిషినల్ లుక్
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

కరోనా వచ్చింది.. సేవకు టైం దొరికింది
టాలీవుడ్ లో మరో నటడు కరోనా బారిన పడ్డాడు. ఈ నటుడు ఎవరో కాదు సోనూ సూద్. సోనూ సూద్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఈవిషయాన్ని సోనూ సూద్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. ‘ఈ రోజు ఉదయం కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్ అని తేలింది. ముందుజాగ్రత్త చర్యగా నేను ఇప్పటికే సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉన్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందవద్దు. దీనివల్ల మీ సమస్యల పరిష్కారం కోసం నాకు చాలా సమయం దొరుకుతుంది. నేను మీ అందరివాడిని అనే విషయం గుర్తుపెట్టుకోండి’అని సోనూసూద్ ట్వీట్ చేశాడు. దీంతో సోనూసూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్…
"అల ..వైకుంఠపురములో.. " సెన్సేషనల్ రికార్డ్
గీతా ఆర్ట్స్ , హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూజాహెగ్డే జంటగా రూపొందిన "అల ..వైకుంఠపురములో.. "మూవీ 2020 సంవత్సరం జనవరి 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టబు , సుశాంత్ , నివేత పేతురాజ్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

'విజయ రాఘవన్' రిలీజ్ డేట్ ఫిక్స్
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా విజయరాఘవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే యువకుడి కథే ‘విజయ రాఘవన్ . తమిళ్ లో 'కోడియిల్ ఒరువన్' గా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగులో 'విజయ రాఘవన్'గా విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా…

'మహాసముద్రం' - సిద్ధార్థ్ ఫస్ట్ లుక్ రిలీజ్
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన నటుడు సిద్దార్థ్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే గత కొద్దికాలంగా పెద్దగా సినిమాలను చేయడంలేదు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు.

స్టార్ కమెడియన్ వివేక్ కన్నుమూత
తమిళ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. గత ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులను కోల్పోయాం. ఇక ఇప్పుడు మరో తమిళ్ స్టార్ కమెడియన్ ను కోల్పోవాల్సి వచ్చింది. తన కామెడీతో కోట్లాది ప్రేక్షకులని కడుపుబ్బ నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు వివేక్ తుదిశ్వాస విడిచారు. నిన్న గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చేరిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ రోజు తెల్లవారుఝామున 4.35 ని.లకు గుండెపోటుతో కన్నుమూశారు. వివేక్ మరణంతో తమిళ్ ఇండస్ట్రీ మొత్తం దిగ్భ్రాంతికి గురై ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ క్షేమం కోరుతూ మహేష్ బాబు ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ "మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడడంతో అభిమానులు సంతోషంగా ఉండగా తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు తమ హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు పవన్ క్షేమాన్ని కోరుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

'ఏక్ మినీ కథ' రిలీజ్ డేట్ ఫిక్స్
‘పేపర్ బాయ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన సంతోష్ నటుడిగా ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకున్నారు. అయినే సినిమా అంత విజయం ఇవ్వలేకపోయింది. ఇప్పుడు ‘ఏక్ మినీ కథ’ చిత్రంలో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల్ని నవ్విండానికి సిద్ధమయ్యాడు. నూతన దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో శోభన్ హీరోగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

పవన్ కు కరోనా పాజిటివ్ - కొనసాగుతున్నచికిత్స
కరోనా సెకండ్ వేవ్ లో చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే కదా. వకీల్ సాబ్ టీమ్ కు కరోనా టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే హీరోయిన్ నివేదా థామస్ కరోనా బారిన పడింది. ఆ తర్వాత మరికొందరికి సైతం కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న తన స్పీచ్ తో టాప్ వన్ ట్రెండింగ్ లో నిలిచిన బండ్ల గణేష్ రెండోసారి కోరోనా బారిన పడ్డారు. ఈనేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గత కొద్దిరోజులుగా ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం పవన్…

విశ్వక్ సేన్ కొత్తసినిమా టైటిల్ రిలీజ్
‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విశ్వక్ సేన్. ఆతరువాత వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’ నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆనందంలో అడివి శేష్
సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సూపర్ హిట్ "గూఢచారి ", "ఎవరు "మూవీ ఫేమ్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ "మేజర్ "జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.