విశ్వక్ సేన్ కొత్తసినిమా టైటిల్ రిలీజ్

Vishwak Sen New Movie Title Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vishwak Sen,Actor Vishwak Sen,Hero Vishwak Sen,Vishwak Sen Latest News,Vishwak Sen New Movie,Vishwak Sen Movies,Vishwak Sen Latest Movie,Vishwak Sen Next Movie,Vishwak Sen Upcoming Movie,Vishwak Sen Next Movie Title Announced,Vishwak Sen New Movie Title,Vishwak Sen VS7 Movie,VS7,VS7 Movie Title,VS7 Title Out,VS7 Title Out Now,VS7 Title Announced,Ashoka Vanam Lo Arjuna Kalyanam,Ashoka Vanam Lo Arjuna Kalyanam Movie,Ashoka Vanam Lo Arjuna Kalyanam Telugu Movie,Vishwak's Ashoka Vanamlo Arjuna Kalyanam,Vishwak Sen In Ashoka Vanam Lo Arjuna Kalyanam,Vishwak Sen As Arjun In Ashoka Vanam Lo Arjuna Kalyanam,#VS7,#AVAK

‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు విశ్వక్ సేన్. ఆతరువాత వచ్చిన ‘ఫలక్‌నుమా దాస్’ నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా చేస్తున్నాడు. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక పాగల్ చేస్తూనే అశ్వ‌థ్‌ మ‌రిముత్తు ద‌ర్శ‌క‌త్వం ఓ మై కడవులే రీమేక్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మరోసినిమాను లైన్ లో పెట్టాడు. విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఓ లవ్ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఇకఈసినిమా టైటిల్ ను నేడు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈసినిమాకు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కాగా ఈసినిమాను ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here