‘మహాసముద్రం’ – సిద్ధార్థ్‌ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Maha Samudram Movie Team Releases Siddharth First Look On His Birthday,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Siddharth,Actor Siddharth,Hero Siddharth,Siddharth Maha Samudram,Maha Samudram,Maha Samudram Movie,Maha Samudram Telugu Movie,Maha Samudram Movie Update,Siddharth Movies,Siddharth New Movie,Maha Samudram First Look,Maha Samudram Siddharth First Look,Siddharth First Look,Happy Birthday Siddharth,Maha Samudram Team Releases Siddharth First Look On His Birthday,Siddharth First Look From Maha Samudram Released,Siddharth First Look Poster From Maha Samudram Unveiled,Siddharth's First Look From Maha Samudram Out,First Look Poster Of Siddharth From Maha Samudram,Siddharth First Look,Siddharth's First Look From Maha Samudram Out,#HBDSiddharth,#Mahasamudram

బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన నటుడు సిద్దార్థ్. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అయితే గత కొద్దికాలంగా పెద్దగా సినిమాలను చేయడంలేదు ఈ టాలెంటెడ్ హీరో. ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత తెలుగులో మరో సినిమాతో వస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ – సిద్దార్థ్ ప్రధాన పాత్రల్లో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం రూపొందిస్తున్నారు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత సిద్ధార్థ్‌ ఈసినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ రోజు సిద్ధార్థ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ మూవీ నుండి ఆయ‌న ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో డీసెంట్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు సిద్దార్థ్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇటీవలే అదితి రావు పుట్టినరోజు కాగా ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఆగస్ట్ 19న ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌రో హీరో సిద్ధార్ద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + sixteen =