‘ఐకాన్’ కు మంచి స్టోరీ లైన్ ఉంది

Icon Movie Makers Exudes Confidence On Story Line,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Icon Movie,Icon Makers Exudes Confidence On Story Line,Icon Movie Makers On Story Line,Dil Raju Gives Clarity about Allu Arjun ICON Movie,Director Sriram Venu,Dil Raju,Dil Raju Movies,Dil Raju Latest News,Dil Raju Next Movie,Dil Raju About Icon Movie,Icon,Icon Film,Icon Movie Update,Icon Movie Latest News,Icon Telugu Movie,Icon Movie Story Line,Dil Raju About Allu Arjun ICON Movie,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Icon Movie,Allu Arjun Icon Movie Updates,Dil Raju About Allu Arjun Icon Movie,Dil Raju About Icon Movie,Dil Raju About Allu Arjun Icon,Allu Arjun Icon,Dil Raju Press Meet,Allu Arjun Icon Movie Story,Icon Movie Story,Allu Arjun Icon Has A Good Story Line

మొత్తానికి ఏది ఎలా ఉన్నా ఈసారి పరిస్థితులు బన్నీ ఐకాన్ సినిమాకు మాత్రం కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈసినిమా ఇంతవరకూ ఆ అదృష్టానికి నోచుకోలేదు. సినిమాను అయితే ఎప్పుడో ప్రకటించారు కానీ అప్పటినుండి ఎవరు చెప్పినా సినిమా పక్కా ఉంటుంది.. ఉంటుంది అంటున్నారే తప్పా ట్రాక్ లోకి తీసుకురావడంలేదు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీ ఈ సినిమానే చేస్తాడని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ.. దాన్ని పక్కన పెట్టి ‘అల వైకుంఠపురములో’ను లైన్లో పెట్టేశాడు. ఈసినిమా తరువాత అయినా చేస్తాడనుకుంటే వెంటనే పుష్ప సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు పుష్ప తరువాత బన్నీ ఐకాన్ సినిమాను చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీని నిర్మాత దిల్ రాజు కూడా ఈసినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించడానికే చూస్తున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకూ వేణు శ్రీరామ్ ఐకాన్ గురించి అడిగినా పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఇక వకీల్ సాబ్ సినిమాతో తన సత్తా చూపించాడు. మరోవైపు దిల్ రాజు వకీల్ సాబ్ సక్సెస్ మీట్ లో దీని గురించి మాట్లాడుతూ నిజానికి వకీల్ సాబ్ కంటే ముందో ఈసినిమా స్క్రిప్ట్ ఓకే చేశాం.. నేను వేణుశ్రీరామ్ మంచి కథల కోసం చూస్తున్నాం.. ఐకాన్ మంచి స్క్రిప్ట్ ఉన్న కథ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.. ఇప్పటివరకూ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కానీ త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళతాం అని దిల్ రాజు చెప్పాడు. మరి దిల్ రాజు చెప్పాడంటే ఖచ్చితంగా పుష్ప తరువాత బన్నీ ఐకాన్ సినిమానే మ్యాగ్జిమమ్ చేసే అవకాశం కనిపిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =