దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతుంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతుంది. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. “అఖండ “మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని మొయినాబాద్ లో జరుగుతుంది. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ పై కీలక సన్నివేశాలను దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ ప్రగ్య మాట్లాడుతూ .. హీరో బాలకృష్ణ తో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ అమేజింగ్ అనీ , కరోనా నేపథ్యం లో అన్ని జాగ్రత్తలతో షూటింగ్ లో పాల్గొంటున్నామనీ చెప్పారు. పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న “అఖండ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మూవీ కి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: