గోవాలో అఖిల్ ‘ఏజెంట్’

Agent Movie Team Heads To Goa For Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Akhil Akkineni To Fly To Goa,Surender Reddy,Director Surender Reddy,Surender Reddy Movies,Latest Update Of Agent,Agent Movie Team Planning Agent First Schedule In Goa,Team Of Agent And Akhil Akkineni Will Head To Goa For The Shoot,Akhil Akkineni,Actor Akhil Akkineni,Hero Akhil Akkineni,Akhil Akkineni Agent,Agent Akhil,Akhil Movies,Akhil New Movie,Akhil Next Movie,Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Movie Latest Updates,Agent Team Heads To Goa For Movie Shoot,Agent First Schedule In Goa,Agent First Schedule,Agent Movie Shoot,Agent Movie Shooting,Agent Movie Shooting Update,Agent Movie Shoot In Goa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఏజెంట్ ఫస్ట్ లుక్ ను అఖిల్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకూ లవర్ బాయ్ లా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఈ ఫస్ట్ లుక్‌లోనే విడుదల తేదీని కూడా ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా డిసెంబర్ 24న విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. రెగ్యూలర్ షూటింగ్ మే 2 నుంచి గోవాలో జరుగనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఇండియాలో పలు లోకేషన్స్‌లలో షూట్ చేయనున్నారు. ప్రస్తుతం ఇక్కడ షూటింగ్ పార్ట్ పూర్తి చేసి కరోనా ప్రభావం కాస్త తగ్గిన తరువాత విదేశాలలో షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. కాగా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముంబైకి చెందిన మోడల్ సాక్షి వైద్య నటిస్తున్నట్టు సమాచారం. వక్కంతం వంశీ ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టొరీ అందించగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు చిత్రయూనిట్.

అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. జూన్ 19న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 2 =