
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 47


విలన్ పాత్రలకు సిద్ధమే - విశ్వక్ సేన్

'త్రిష' పెళ్లి పై 'ఛార్మి' హింట్ ఇచ్చినట్టేనా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు

రీమేక్ మూవీస్ పై టాలీవుడ్ హీరోల ఆసక్తి

'ఖిలాడి' కూడా వెనక్కి తగ్గాడు

'రాధే శ్యామ్' జస్ట్ గ్లింప్స్ తోనే యూనిక్ రికార్డ్

‘అఖండ’ ట్రైలర్ ఆరోజు లేదు.. నిర్మాత క్లారిటీ

రాశీఖన్నా మెస్మరైజింగ్ లుక్

కలసి పోరాడుదాం - తమన్నా

ప్రముఖ నిర్మాణ సంస్థకు ‘దృశ్యం2’ హిందీ రైట్స్

రెజీనా మూవీ టైటిల్ "శాకిని ఢాకిని"

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్

అనాథ పిల్లలకు అండగా హీరో సందీప్ కిషన్

కృతి శెట్టి మనసులో మాట

హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్ - రీతూ వర్మ

క్రేజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ

కరోనా సెకండ్ వేవ్ పై అనుష్క స్పందన

స్టుపిడ్ కరోనాను తన్నేశా ..!
తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇక బిజీ షెడ్యూల్స్ తో క్షణం కూడా తీరిక లేని పూజా స్పీడ్ కు కరోనా బ్రేక్ వేసింది. ఇక ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా రీసెంట్ గా పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తనకు మైల్డ్ గానే కోవిడ్ లక్షణాలు ఉన్నాయని.. కోలుకుంటున్నానని ఇటీవలే తెలిపింది. అంతేకాదు ఐసొలేషన్ టైమ్ లో పాజిటివ్ గా ఉండేందుకు యోగా, ధ్యానం చేస్తున్నానని, మంచి పుస్తకాలు చదువుతున్నానని తెలిపింది.

విజయ్ దేవరకొండ బర్త్ డే కు "లైగర్ "స్పెషల్ సర్ ప్రైజ్
పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా తెలుగు , హిందీ భాషలలో యాక్షన్ ఎంటర్ టైనర్”లైగర్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “లైగర్ “మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ థాయ్ ల్యాండ్ లోమార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. ఒక షూటింగ్ షెడ్యూల్ ముంబై లో జరిగిన తరువాత లైగర్ “మూవీ యూనిట్ కరోనా మహమ్మారి కారణం గా చాలా రోజుల గ్యాప్ తరువాత మరో షూటింగ్ షెడ్యూల్ ముంబై లో ప్రారంభించింది . కరోనా సెకండ్ వేవ్ కారణంగా లైగర్ “మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

విలన్ పాత్రలకు సిద్ధమే - విశ్వక్ సేన్
“వెళ్ళిపోమాకే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?” మూవీ తో గుర్తింపు పొందారు. సూపర్ హిట్ “ఫలక్ నుమా దాస్” తో విశ్వక్ దర్శకుడిగా మారారు. సూపర్ హిట్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ “HIT -ది ఫస్ట్ కేస్ “ మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విశ్వక్ ప్రేక్షకులను అలరించారు. వరస హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో విశ్వక్ సేన్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నారు.

'త్రిష' పెళ్లి పై 'ఛార్మి' హింట్ ఇచ్చినట్టేనా..!
కొంత మంది హీరోయిన్స్ వ్యక్తిగత జీవితం ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. వారి పెళ్లి, ప్రేమ విషయాలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ముఖ్యంగా నయనతార, త్రిష, అనుష్క వీరి పెళ్లిళ్లపై ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. వీరిలో నయన్ అంటే విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుంది కాబట్టి అది వేరు. ఇక త్రిష పెళ్లి పై కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా త్రిష పెళ్లిపై మరోసారి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడం కామనే అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఛార్మీట్వీట్ తో త్రిష పెళ్లి గురించి హింట్ ఇచ్చిందా అంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై విశ్వక్ సేన్ ప్రశంసలు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సక్సెస్ ఫుల్ చిత్ర యంగ్ హీరో విశ్వక్ సేన్ వీరాభిమాని అని తెలిసిన విషయమే. ఎన్టీఆర్ హానెస్ట్ యాక్టర్ అనీ ,"సింహాద్రి "మూవీ నుండి ఎన్టీఆర్ ను ఇన్ స్పి రేషన్ గా తీసుకున్నాననీ , తెలుగు భాష పై పట్టున్న నటుడనీ , ప్రతి పదాన్ని ప్రతీ డైలాగ్ ని స్పష్టంగా పలక గల నటుడు ఎన్టీఆర్., నిజాయితీ గల నటుడు. ఆయనకు ఆయనే సాటి'' అనీ , కమర్షియల్ సినిమాలో కూడా కన్వీనియన్స్ యాక్టింగ్ చేయగలిగేది ఎన్టీఆర్ అనీ విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించారు.

రీమేక్ మూవీస్ పై టాలీవుడ్ హీరోల ఆసక్తి
పరాయి భాషలలో ఘనవిజయం సాధించిన మూవీస్ తెలుగు రీమేక్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే ఆలోచన తో టాలీవుడ్ హీరోలు పర భాషా చిత్రాల పై ఆసక్తి చూపుతున్నారు. దానితో టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హవా పెరిగిపోయింది. "ఆచార్య "మూవీ లో నటిస్తున్న మెగా స్టార్ చిరంజీవి "లూసిఫర్ "(మలయాళ ), "వేదాళం "(తమిళ ) మూవీ తెలుగు రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'ఖిలాడి' కూడా వెనక్కి తగ్గాడు
దేశంలో కరోనా ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. విలయతాండవం చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇంకొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు ఈలిస్ట్ లో మరో సినిమా కూడా చేరింది. అది మరేదో కాదు రవితేజ ఖిలాడి సినిమా.

'దాసరి' కి పద్మ పురస్కారం ఇవ్వాలి.. 'చిరు' విన్నపం
ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ఎవరంటే దాసరి నారాయణ రావు అని ఎవర్ని అడిగినా చెపుతారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి దగ్గరుండి సమస్యను పరిష్కారం చేసేవారు. ఇక దాసరి చనిపోయాక ఇండస్ట్రీ పెద్ద దిక్కును కోల్పోయింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరునే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయ్యారు. చిరునే దాసరి ప్లేస్ ను రీప్లేస్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై స్పందిస్తున్నారు. పెద్దరికంగా వ్యవహరిస్తున్నారు. ఇక దాసరి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మృసించుకున్నారు చిరు. అంతేకాదు ఆయనకు పద్మ పురస్కారం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు.

'రాధే శ్యామ్' జస్ట్ గ్లింప్స్ తోనే యూనిక్ రికార్డ్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు రికార్డులు కొత్తేమి కాదు. ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో యూనిక్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ ను మాత్రమే రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే కేవలం ఈ గ్లింప్స్ తోనే ఇప్పుడు ప్రభాస్ యూనిక్ రికార్డ్ క్రియట్ చేశాడు.

‘అఖండ’ ట్రైలర్ ఆరోజు లేదు.. నిర్మాత క్లారిటీ
'సింహా', 'లెజెండ్' సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ 'అఖండ' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈమధ్యనే మళ్లీ షూటింగ్ మొదలు పెట్టగా షూటింగ్ కూడా చివరి దశకు వచ్చేసింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గా ‘అఖండ’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా సంచలనాలు రేపుతుంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది.

రాశీఖన్నా మెస్మరైజింగ్ లుక్
కోలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖన్నా "థ్యాంక్ యు”, "పక్కా కమర్షియల్ "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతుంది. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం "థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

కలసి పోరాడుదాం - తమన్నా
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా కరోనా కారణం తో విడుదల వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం తో ఆసుపత్రిల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సీలిండర్లు దొరక్క మరణించే వారి సంఖ్య అధికమవుతున్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా తమవంతు సాయం అందిస్తున్నారు . ప్రజలకు ధైర్యం చెబుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ తమన్నా కూడా తాజాగా ఒక పోస్ట్ చేశారు.

ప్రముఖ నిర్మాణ సంస్థకు ‘దృశ్యం2’ హిందీ రైట్స్
జీతూజోసఫ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈసినిమా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో రీమేక్ చేయగా అన్ని భాషల్లోమంచి విజయం దక్కించుకుంది. ఇక దీనికి సీక్వెల్ గా మలయాళంలో వచ్చిన ”దృశ్యం 2” కూడా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు తెలుగులో కూడా దృశ్యం 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. వెంకీ-మీనా ప్రధాన పాత్రల్లోనే ఈరీమేక్ కూడా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

రెజీనా మూవీ టైటిల్ "శాకిని ఢాకిని"
తమిళ హీరోయిన్ రెజీనా "శివ మనసులో శృతి "మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను రెజీనా ఆకట్టుకున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న రెజీనా ఒక కొరియన్ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సమ్మర్ లో కన్ఫామ్
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన 'ది ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి ఎంత హిట్ అయిందో తెలుసు. దీంతో మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా మంది చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అప్పటి నుండి ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది.

అనాథ పిల్లలకు అండగా హీరో సందీప్ కిషన్
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తోంది. ప్రజలంతా భయాందోళనతో ఉంటున్నారు. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ , కర్ఫ్యూ విధించాయి. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం చేయూతగా ఉండడం చాలా ముఖ్యం. సినీ సెలబ్రిటీలు తమ వంతు బాధ్యతగా కరోనా బాధితులకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు యువ హీరో సందీప్ కిషన్ ఒక మంచి పనికి శ్రీకారం చుట్టి , తన మంచి మనసును చాటుకున్నారు.

కృతి శెట్టి మనసులో మాట
బ్లాక్ బస్టర్ "ఉప్పెన మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి ఆమూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కృతిశెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నేచురల్ స్టార్ నానితో పీరియాడికల్ మూవీ 'శ్యామ్ సింగరాయ్'లో నటిస్తున్న కృతి, సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమాలో కూడా కథానాయికగా నటిస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

హ్యాట్సాఫ్ టు పవన్ కళ్యాణ్ - రీతూ వర్మ
బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. "వకీల్ సాబ్ "మూవీ ప్రస్తుతం ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సందడి చేస్తుంది.

క్రేజీ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ
తెలుగులో టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు ఇటీవలే వకీల్ సాబ్ తో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇన్నేళ్లు ఇక్కడ తెలుగులో ఎన్నో విజయాలు చవిచూసిన విజయ్ ఇప్పుడు తమిళ్ లో కూడా తన సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఇప్పటికే శంకర్-చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు నిర్మాతగా ఒక సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా. అది ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో కూడా తెలీదు.. కానీ అప్పుడే మరో క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది.

కరోనా సెకండ్ వేవ్ పై అనుష్క స్పందన
భారత దేశంలో కరోనా వేవ్ అధిక ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. లక్షలలో కేసులు నమోదు , వేలల్లో మరణాలుసంభవిస్తున్నాయి. ప్రజలలో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రజలలో కరోనా పట్ల భయాన్ని తొలగించి , ధైర్యాన్ని నింపేలా , కరోనా కష్ట కాలాన్ని అధిగ మిస్తామనే భరోసా నిచ్చేలా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు.