స్టుపిడ్ కరోనాను తన్నేశా ..!

Pooja Hegde Tests Negative For Corona Virus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja HegdeLatest Updates,Pooja Hegde Covid News,Pooja Hegde Coronavirus News,Pooja Hegde Coronavirus,Pooja Hegde Covid,Pooja Hegde Tests Negative,Actress Pooja Hegde Tests Negative,Pooja Hegde Tests Negative For COVID-19,Pooja Hegde Tests Negative For Coronavirus,Pooja Hegde Tests Coronavirus Negative,Pooja Hegde Tests COVID-19 Negative,Pooja Hegde Tests Negative For Covid-19,Pooja Hegde Tests Covid-19 Negative,Pooja Hegde Recovers From Covid-19,Pooja Hegde Recovers From Coronavirus,Pooja Hegde COVID Negative,Pooja Hegde Corona Negative,Pooja Hegde Movies,Pooja Hegde New Post

తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది హీరోయిన్ పూజా హెగ్డే. ఇక బిజీ షెడ్యూల్స్ తో క్షణం కూడా తీరిక లేని పూజా స్పీడ్ కు కరోనా బ్రేక్ వేసింది. ఇక ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడగా రీసెంట్ గా పూజా హెగ్డేకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తనకు మైల్డ్ గానే కోవిడ్ లక్షణాలు ఉన్నాయని.. కోలుకుంటున్నానని ఇటీవలే తెలిపింది. అంతేకాదు ఐసొలేషన్ టైమ్ లో పాజిటివ్ గా ఉండేందుకు యోగా, ధ్యానం చేస్తున్నానని, మంచి పుస్తకాలు చదువుతున్నానని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంది. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపింది. ఈనేపథ్యంలో తన ట్విట్టర్ ద్వారా “నాపై ప్రేమను కురిపించిన మీ అందరికీ థాంక్స్‌. నేను బాగా కోలుకున్నాను. స్టుపిడ్‌ కరోనాను ఓ తన్ను తన్నాను. కరోనా నెగటివ్‌ వచ్చింది. ఏయ్‌.. మీ అందరి ప్రార్థనలు కారణంగానే నాకు హీలింగ్ ఎనర్జీ వచ్చి మేజిక్‌ జరిగింది. మీకెప్పటికీ రుణపడి ఉంటాను” అని తెలియజేసిన పూజా హెగ్డే అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

ఇదిలా ఉండగా పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ హీరోగా వస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుంది. దానితో పాటు అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేసింది. ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే తమిళ్ లో విజయ్, హిందీలో రణ్వీర్ సింగ్ తో సినిమాలు చేస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + eleven =