పరాయి భాషలలో ఘనవిజయం సాధించిన మూవీస్ తెలుగు రీమేక్ మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే ఆలోచన తో టాలీవుడ్ హీరోలు పర భాషా చిత్రాల పై ఆసక్తి చూపుతున్నారు. దానితో టాలీవుడ్ లో రీమేక్ మూవీస్ హవా పెరిగిపోయింది. “ఆచార్య “మూవీ లో నటిస్తున్న మెగా స్టార్ చిరంజీవి “లూసిఫర్ “(మలయాళ ), “వేదాళం “(తమిళ ) మూవీ తెలుగు రీమేక్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న రెండు మూవీస్ రీమేక్ లే. “అసురన్ “తమిళ మూవీ “నారప్ప “, “దృశ్యం 2″మలయాళ మూవీ”దృశ్యం 2 “లో వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాలీవుడ్ మూవీ “పింక్ “కు తెలుగు రీమేక్ గా రూపొందిన “వకీల్ సాబ్ “ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం “అయ్యప్పనుమ్ కోషియమ్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్నారు. నితిన్ హీరోగా బాలీవుడ్ మూవీ “అంధాధున్ ” తెలుగు రీమేక్ గా”మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతుంది. “కర్ణన్ “తమిళ మూవీ ని తెలుగు లో రీమేక్ చేయడానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ట్రై చేస్తున్నట్టు సమాచారం. పలువురు తెలుగు హీరోలు రీమేక్ లపై ఫోకస్ పెట్టారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: