దేశంలో కరోనా ఎంత విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. విలయతాండవం చేస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక సినిమా షూటింగ్ లు కూడా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఇంకొన్ని సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు ఈలిస్ట్ లో మరో సినిమా కూడా చేరింది. అది మరేదో కాదు రవితేజ ఖిలాడి సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రమేశ్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ఎంటర్‌టైనర్ సినిమాగా రూపొందుతున్న ఖిలాడి సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితులు కాస్త చక్కబడిన తరువాత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని రమేష్ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Keeping the current #Covid19 Pandemic in mind,Mass Maharaja @RaviTeja_offl‘s #Khiladi has been postponed! 🎲
A New Release Date will be announced soon. @ThisIsDSP @DimpleHayathi @Meenachau6 @sagar_singer @idhavish #AStudiosLLP @PenMovies @KHILADiOffl @adityamusic pic.twitter.com/BH4lK7DDrw— Ramesh Varma (@DirRameshVarma) May 5, 2021
కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్.. మలయాళ హీరో ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతీలాల్ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: