ప్రస్తుతం సందీప్ కిషన్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ‘గల్లీ రౌడీ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొనే పనిలో ఉంది. ఎలాగూ థియేటర్లు ఓపెన్ చేస్తున్నారు కాబట్టి.. త్వరలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేద వ్యాస్ దర్శకత్వంలో కూడా సందీప్ కిషన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడింది. అయితే నేడు ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసినట్టు సందీప్ కిషన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కాగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. అయితే పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
And Back in Action 🤟🏽@varusarath5 #PriyaPrakashVarrier @DiganganaS @_vedavyas_A @appunitc@smkoneru @EastCoastPrdns@SricharanPakala @ChotaKPrasad @RajeshDanda_
#SK27 pic.twitter.com/P7Cuv1CfZA
— Sundeep Kishan (@sundeepkishan) July 6, 2021
దీనితో పాటు వీఐ ఆనంద్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘టైగర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ న్యాచురల్ ఫాంటసీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈసినిమాను హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: