ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 6
'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్
"డర్టీ హరి" మూవీ పై సునీల్ ప్రశంసలు
రష్మిక ఫిట్ నెస్ మంత్రం
హిందీ 'జెర్సీ' షూటింగ్ పూర్తి
"వకీల్ సాబ్" మూవీ రికార్డ్
హీరో రానా బర్త్ డే కు అనుష్క విషెస్
అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో
కవిత్వంలో సేద తీరుతా- రాశీఖన్నా
హైదరాబాద్ లో "అన్నాత్తే "
F3 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
నారప్ప గ్లిమ్స్ వీడియో రిలీజ్
'కోతి కొమ్మచ్చి' షూటింగ్ కంప్లీట్
కాబోయే వరుడు.. వెడ్డింగ్ గురించి రకుల్ మాటల్లో
మేజర్ ఫస్ట్ లుక్ రిలీజ్
క్షణం, గూఢచారి వంటి సినిమాల్లో తనదైన నటనతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు రెండు రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే కదా.
'లూసిఫర్' రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.

"సలార్ "మూవీ ఆడిషన్స్ కు విశేష స్పందన
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సలార్" మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. "సలార్" మూవీలో న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికై దర్శక , నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. హెదరాబాద్ , చెన్నై , బెంగళూరు లలో ఆడిషన్స్ నిర్వహించి కొత్త టాలెంట్ కు అవకాశం కల్పించడానికై దర్శకుడు ప్రకటించారు. ఏ వయస్సు వారైనా , ఏ భాష వారైనా ఆడిషన్స్ లో పాల్గొన వచ్చునని తెలిపారు.

'ఆర్ఆర్ఆర్' - 10 రోజుల షూట్ పూర్తి చేసుకున్న అలియా భట్
ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవలే 50రోజుల లాంగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా తక్కువ గ్యాప్ లోనే మహారాష్ట్రలోని మహాబలేశ్వరం మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఇక ఆ షెడ్యూల్ తర్వాత, బాలీవుడ్ నటి అలియా భట్ రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

'మేజర్' ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా తీయడం వెనుక అడివిశేష్ చేసిన రీసెర్చ్ గురించి చెపుతూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోలో 2008 నుండి సందీప్ ఉన్నికృష్ణన్ తనకు మైండ్‌లో ఉన్నారని.. ముంబై టెర్రర్ దాడులు జరిగినప్పుడు సాపన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నా.. న్యూస్ ఛానెల్‌లో ఉన్నికృష్ణన్ ను చూస్తే నా బ్రదర్ లా అనిపించింది.. ఎలాగైనా…
హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది - శృతి హాసన్
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "తమిళ మూవీ లో శృతి కథానాయికగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "వకీల్ సాబ్ "మూవీ లో శృతి కథానాయికగా ఎంపిక అయ్యారు. "గబ్బర్ సింగ్ ", "కాటమ రాయుడు " మూవీస్ తో పవన్ కళ్యాణ్ , శృతి జోడీ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
"డర్టీ హరి" మూవీ పై సునీల్ ప్రశంసలు
గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో ఎస్ పి జె క్రియేషన్స్ బ్యానర్ పై శ్రవణ్ రెడ్డి హీరోగా, పలు బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన ఎమ్ ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ "డర్టీ హరి " మూవీ డిసెంబర్ 18 వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రుహానీ శర్మ , సిమ్రత్ కౌర్ కథానాయికలు. మార్క్ K రాబిన్ సంగీతం అందించారు.
రష్మిక ఫిట్ నెస్ మంత్రం
తెలుగు,కన్నడ భాషల లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తూ రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
హిందీ 'జెర్సీ' షూటింగ్ పూర్తి
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు.
"వకీల్ సాబ్" మూవీ రికార్డ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీ కపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ "పింక్ "మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , ప్రకాష్ రాజ్ , నరేష్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
హీరో రానా బర్త్ డే కు అనుష్క విషెస్
సక్సెస్ ఫుల్ "లీడర్ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రానా దగ్గుబాటి తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు. రానా ప్రస్తుతం "విరాటపర్వం "మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న "విరాటపర్వం "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. రానా హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

100 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 4
బిగ్ బాస్ 4 - ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది సీజన్ 4. ఈ ఎపిసోడ్ తో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఫైనల్ లోకి వెళ్లామని అందరూ చాలా హ్యాపీగా ఉంటే ఈ లోపు బిగ్ బాస్ మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేశాడు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం..
అభిజిత్ కు మద్దతుగా రౌడీ హీరో
బిగ్ బాస్ సీజన్ ముగియడానికి ఇంకా కేవలం ఒక వారం మాత్రమే ఉంది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్ లో వున్నారు. ఇక ఓటింగ్ పోల్ కూడా నిన్ననే ఓపెన్ అవ్వడంతో తమ అభిమానులను గెలిపించే పనిలో పడ్డారు. ఓట్లు వేసే పనిలో పడ్డారు. ఇక ఆఖరి అంకానికి చేరడంతో కంటెస్టెంట్స్ కు కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.
కవిత్వంలో సేద తీరుతా- రాశీఖన్నా
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం లో తమిళ భాష , గిటార్ ను రాశీఖన్నా నేర్చుకున్న విషయం తెలిసిందే. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. 4 తమిళ మూవీస్ లో కథానాయిక గా నటిస్తున్న రాశీఖన్నా ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
హైదరాబాద్ లో "అన్నాత్తే "
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నయనతార , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంగీతం డి ఇమ్మాన్ అందిస్తున్నారు.
"విరాటపర్వం " రానా ఫస్ట్ లుక్ రిలీజ్
సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ" మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "విరాటపర్వం "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి , నందితాదాస్ , నివేత పేతురాజ్ , నవీన్ చంద్ర , ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
F3 కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్2'. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్‌లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా అనిల్ రావిపూడి లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లడమే లేట్.
నారప్ప గ్లిమ్స్ వీడియో రిలీజ్
వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పునఃప్రారంభించగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రయూనిట్.
'కోతి కొమ్మచ్చి' షూటింగ్ కంప్లీట్
డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీహరి తనయుడు మేఘాంష్, సతీష్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న హీరోలుగా 'కోతి కొమ్మచ్చి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దివంగత శ్రీహరి గారి జయంతి సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్ని రోజులు షూటింగ్చేస్తూ వచ్చారు. ఇక తాజా సమాచారం సినిమా షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. షూటింగ్ మొదలు పెట్టి కేవలం నెల రోజులు మాత్రం అయింది.. ఎయిడ్ కూడా అవుట్ డోర్ షూటింగ్.. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేయడం నిజంగా గొప్ప విషయమే. ఇంకా ఒక్క పాట మాత్రమే ఉన్నట్టు…
కాబోయే వరుడు.. వెడ్డింగ్ గురించి రకుల్ మాటల్లో
రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఒకసారి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి.. ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉండాలి అని చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనకు కాబోయేవాడు ఎలా ఉండాలి, తమ పెళ్లి ఎలా జరగాలి అనే విషయాలు చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇక ఈ సందర్భంగా ఆమె..తనకు ప్రేమ, పెళ్లిపై నమ్మకముందని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను సంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం నుంచి వచ్చానని, నాన్న ఆర్మీ ఉద్యోగం చేశారు కాబట్టి ఆ వాతావరణంలోనే పెరిగానని తనకు కాబోయే భర్త కూడా ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ని ఫాలో అయితే చాలా సంతోష పడతానని తెలిపారు.