మలయాళంలో హిట్టయిన ‘లూసిఫర్’ చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. మొదట వినాయక్ అన్నారు. ఆ తర్వాత వినాయక్ తప్పుకున్నాడని.. ఆ తర్వాత రీమేక్ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు అప్పచెప్పినట్టు.. సుజీత్ కూడా కథ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడని అన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సుజీత్ కూడా ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు ఈమధ్య వార్తలు వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఫైనల్లీ ఈ రీమేక్ కు డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు. తమిళ ఇండస్ట్రీలో రీమేక్ స్పెషలిస్టుగా పేరుగాంచిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు మోహన్ రాజా అయితే ఫర్ ఫెక్ట్ గా ఉంటుందని చిరు ఫిక్స్ అయ్యాడట. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మిస్తున్న కొణిదెల ప్రో కంపెనీ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఆచార్య షెడ్యూల్ పూర్తయిన వెంటనే జనవరి నుంచి లూసిఫర్ సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు చిరంజీవి టీం రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
#MegaStar153 #Lucifer movie Telugu remake will be directed by @Jayam_Mohanraja and jointly produced by @KonidelaPro & NVR Cinema.
#MegaStar @KChiruTweets will join the sets after Sankranthi 2021. pic.twitter.com/r5t0ZiuWo9
— Konidela Pro Company (@KonidelaPro) December 16, 2020
ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: