హిందీ ‘జెర్సీ’ షూటింగ్ పూర్తి

#Jersey, hahid Kapoor Jersey Remake, Jersey Actor Nani, Jersey Hindi Remake, Jersey Hindi Remake Details, Jersey Hindi Remake Updates, Jersey Movie, Jersey Movie Hindi Remake, Jersey Remake Shahid Kapoor, Latest Tollywood News, Nani Jersey movie, Nani latest movie updates, nani latest news, Nani New Film Details, Natural Star Nani, Shahid Kapoor, Shahid Kapoor Latest Movie Details On Cards, Shahid Kapoor Wraps Up Shooting For The Hindi Remake Of Jersey, Shahid Kapoor Wraps Up Shooting For The Hindi Remake Of Superhit Film, Telugu Film News 2020, Telugu Filmnagar

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు… విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. జెర్సీ సినిమాలో అర్జున్ పాత్రలో నాని చేసిన నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్రికెట్‌ను వదిలేసి, ప్రభుత్వ ఉద్యోగం పోయి పనిపాటా లేకుండా ఇంట్లో ఖాళీగా ఉంటూ.. ఆ తర్వాత కొడుకు కోసం క్రికెట్ ఆడటం సినిమా మొత్తం ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ ఈ రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలు పెట్టారు. అన్ని సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. అయితే ఇటీవలే మళ్లీ షూటింగ్ ను తిరిగి ప్రారంభించగా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది ఈ సందర్భంగా షాహిద్ కపూర్ తన ట్విట్టర్ ద్వారా షూటింగ్ పూర్తి అయిందని తెలుపుతూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. జెర్సీ సినిమా షూటింగ్ పూర్తయింది.. ఇలాంటి సమయంలో 47 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసాం.. సినిమా కోసం క‌ష్ట‌ప‌డ్డ ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇక ఈ రీమేక్ ను తెలుగులో దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు నిర్మిస్తుండగా వీరిద్దరితో పాటు బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. సూపర్ 30, బాట్ల హౌస్ సినిమాల్లో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =