సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా 1990 ల నాటి నక్సల్ నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ “విరాటపర్వం “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రియమణి , నందితాదాస్ , నివేత పేతురాజ్ , నవీన్ చంద్ర , ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విరాటపర్వం “మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. హీరో రానా బర్త్ డే (డిసెంబర్ 14 ) సందర్భంగా చిత్ర యూనిట్ రానా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఈ మూవీ లోని రానా క్యారెక్టర్ నేమ్ ను రవి అన్న గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. హీరో రానా , సాయి పల్లవి , ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “విరాటపర్వం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో రానా పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హీరోయిన్ సాయి పల్లవి ఈ మూవీ తో పాటు నాగచైతన్య “లవ్ స్టోరీ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: