‘మేజర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

Adivi Sesh, Adivi Sesh Confirms Major Movie Release, Adivi Sesh Next Project Details, Adivi Sesh Upcoming Film News, Adivi Sesh Upcoming Movie updates, Latest Telugu Movie Updates, Major Movie, Major Movie First Look Release Date, Major Movie Team Confirms First Look Release Date, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Actor Adivi Sesh, Tollywood Movie Updates

అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా తీయడం వెనుక అడివిశేష్ చేసిన రీసెర్చ్ గురించి చెపుతూ తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ వీడియోలో 2008 నుండి సందీప్ ఉన్నికృష్ణ‌న్ త‌న‌కు మైండ్‌లో ఉన్నార‌ని.. ముంబై టెర్ర‌ర్ దాడులు జ‌రిగిన‌ప్పుడు సాపన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నా.. న్యూస్ ఛానెల్‌లో ఉన్నికృష్ణ‌న్ ను చూస్తే నా బ్రదర్ లా అనిపించింది.. ఎలాగైనా సినిమా తీయాలనుకున్నా అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఉన్ని కృష్ణన్ తల్లి తండ్రులను కలవడం.. వారిని ఒప్పించడం లాంటి విషయాతో పటు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ లుక్‌ను డిసెంబర్‌ 17 ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

కాగా ఈ సినిమాలో `ద‌బాంగ్ 3` బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌ గా నటిస్తుంది. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మరి గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ కు ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.