మేజర్ ఫస్ట్ లుక్ రిలీజ్

26/11 Martyr Major Sandeep Unnikrishnan, Actor and filmmaker Adivi Sesh, Adivi Sesh, Adivi Sesh Confirms Major Movie Release, Adivi Sesh Next Project Details, Adivi Sesh Upcoming Film News, Adivi Sesh Upcoming Movie Updates, First Look Of Adivi Sesh, Latest Telugu Movie Updates, Mahesh Babu Unveils First Look Of Adivi Sesh, Major Adivi Sesh First Look, Major Movie, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Actor Adivi Sesh, Tollywood Movie Updates

క్ష‌ణం, గూఢచారి వంటి సినిమాల్లో త‌నదైన న‌ట‌న‌తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ప్ర‌స్తుతం ‘మేజర్’ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు రెండు రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు అడివి శేష్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉన్న ఈ పోస్టర్‌లో హీరో అడవి శేష్ గన్ పట్టుకుని కనిపిస్తున్నాడు. ఇక ఈపోస్ట‌ర్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా ఈ చిత్రం ఎలా పుట్టింది, ఫ‌స్ట్ లుక్ ఎలా చేసాం అన్న‌ది ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా అడ‌వి శేష్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా.

కాగా ఈ సినిమాలో `ద‌బాంగ్ 3` బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమాలో `గూఢ‌చారి` హీరోయిన్ శోభిత ధూళిపాళ మరో ముఖ్య కీలక పాత్ర‌లో నటిస్తుంది. మహేష్‌ హోమ్ బేనర్‌ జీఎంబీ ప్రొడక్షన్స్‌ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ కు ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =