వెట్రిమారన్ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ‘అసురన్’ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో వెంకటేష్ ప్రధాన పాత్రలో ‘నారప్పగా’ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలాక్ డౌన్‌కి ముందే 60 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక రీసెంట్‌గానే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పునఃప్రారంభించగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రేపు వెంకీ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర గ్లిమ్స్ని విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇక చెప్పినట్టే గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టిన రోజు కావడంతో ఇంకేదైనా అప్ డేట్ ఇస్తారేమో చూద్దాం.
Here’s the #GlimpseOfNarappa 💥🙌🏼@VenkyMama @priyamani6 @theVcreations #Srikanthaddala
Link: https://t.co/U7I9WKjBAg pic.twitter.com/k1KqFFXy3p
— Suresh Productions (@SureshProdns) December 12, 2020
కాగా ప్రియమణి ఈ సినిమాలో సుందరమ్మగా నటిస్తుంది. నారప్ప పెద్ద కొడుకు మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























