‘ఆర్ఆర్ఆర్’ – 10 రోజుల షూట్ పూర్తి చేసుకున్న అలియా భట్

#RRR Movie Latest News, Alia Bhatt New Movie Details, Alia Bhatt RRR, Alia Bhatt RRR Movie Shooting, Alia Bhatt SS Rajamouli RRR Movie, Alia Bhatt Wraps Up 10 Day Shoot Schedule, Alia Role in RRR, Bollywood Actress Alia Bhatt, Jr. NTR, Latest Tollywood News, Ram charan, RRR Movie Movie Updates, SS Rajamouli, SS Rajamouli RRR Alia Bhatt, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ఆర్ఆర్ఆర్ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తూ బిజీగా షూట్ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవ్వాలి. అసలే లేట్ అవ్వగా కరోనా వల్ల మరింత లేట్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్ ను మళ్లీ మొదలు పెట్టగా రాజమౌళి మాత్రం ఇక ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఇటీవలే 50రోజుల లాంగ్ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా తక్కువ గ్యాప్ లోనే మహారాష్ట్రలోని మహాబలేశ్వరం మరో షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఇక ఆ షెడ్యూల్ తర్వాత, బాలీవుడ్ నటి అలియా భట్ రీసెంట్ గా షూటింగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం అలియా భట్ షూట్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ కు జోడిగా నటిస్తున్నసంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో ఆమెకు, రామ్ చరణ్ కు మధ్యన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతానికి ఆమె షూట్ ముగియడంతో అలియా భట్ హైదరాబాద్ నుండి ముంబై వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ తర్వాత జనవరి నుండి మొదలయ్యే కీలక షెడ్యూల్ లో పాల్గొననుంది.

కాగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ట్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 2 =