100 రోజులు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 4

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, Bigg Boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Highlights, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu 4 Highlights, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Completes 100 Episodes, Bigg Boss Telugu Season 4 Latest News, Bigg Boss Telugu Season 4 Successfully Completes 100 Episodes, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ 4 – ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది సీజన్ 4. ఈ ఎపిసోడ్ తో వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నారు. ఫైనల్ లోకి వెళ్లామని అందరూ చాలా హ్యాపీగా ఉంటే ఈ లోపు బిగ్ బాస్ మళ్లీ వాళ్ల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేశాడు. ఇక నిన్న ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రెగ్యులర్ గా వేసే పాట లాగ కాకుండా.. ఒకపక్క పాట వేస్తూనే మరోపక్క హౌస్ మేట్స్ ఇన్ని రోజులు ఏం చేశారో అవి కూడా బ్యాక్ గ్రౌండ్ లో వేసి కాసేపు నవ్వించాడు బిగ్ బాస్. ఇక నిన్న మోనాల్ ఎలిమినేట్ అవ్వడంతో అఖిల్ కొంచం లోన్లీ గానే ఫీల్ అయ్యాడు. ఆమె లేక‌పోవ‌డంతో పిచ్చి లేస్తుంద‌ని హారిక ద‌గ్గ‌ర బాధ చెప్పుకున్నాడు.

అనంత‌రం బిగ్‌బాస్ ముసుగు వెనుక దాగింది ఎవ‌రు? అనే టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంట్లో మొద‌ట ముసుగు ధ‌రిస్తే దానిని బ‌య‌ట పెట్టింది ఎవ‌ర‌నే విష‌యాన్ని చెప్పాల్సి ఉంటుంది. టాస్క్ ప్రారంభం అవ‌గానే ఇంటి స‌భ్యులు ముఖాన మాస్కు పెట్టుకుని డ్యాన్స్ చేయ‌డం ప్రారంభించారు. మ్యూజిక్ ఆగిపోగానే మొద‌ట అభిజిత్ మాట్లాడుతూ.. నా కోపాన్ని ఇంట్లోకి జంట‌గా అడుగు పెట్టిన‌ సోహైల్‌, అరియానా బ‌య‌ట‌ ప‌డేలా చేశార‌ని చెప్పాడు. త‌న‌కు వంట వ‌చ్చ‌న్న విష‌యం అమ్మ రాజ‌శేఖ‌ర్ వ‌ల్ల అంద‌రికీ తెలిసింద‌ని అరియానా చెప్పుకొచ్చింది. కోపం సోహైల్ వ‌ల్ల‌‌, కెమెరాల ముందు ఏడ‌వ‌డం అవినాష్ వ‌ల్ల బ‌య‌ట ప‌డింద‌ని పేర్కొంది. అనంత‌రం సోహైల్ మాట్లాడుతూ.. దివి వ‌ల్ల అగ్రెసివ్‌, అరియానా వ‌ల్ల వంట చేయ‌డం బ‌య‌ట‌ప‌డింద‌న్నాడు. అఖిల్‌.. నోయ‌ల్ వ‌ల్ల ఏడ‌వ‌డం, అభి వ‌ల్ల కోపం బ‌య‌ట‌ప‌డింద‌ని చెప్పాడు. హారిక‌.. సోహైల్ వ‌ల్ల‌ కోపాన్ని దాచుకోలేక‌పోయాన‌ని చెప్పింది. అభి వ‌ల్ల పొజెసివ్‌నె, అఖిల్ వ‌ల్ల పులిహోర క‌ల‌ప‌డం, అరియానా వ‌ల్ల త‌న‌కున్న స‌హ‌నం బ‌య‌ట‌ప‌డింద‌ని తెల‌పింది.

త‌ర్వాత ఒక‌రి గురించి మ‌రొక‌రు మాట్లాడారు. సోహైల్‌ ఎంత కోప్ప‌డ‌తాడో అంత‌కంటే ఎక్కువ బాధ‌ప‌డ‌తాడు. చిన్న‌పిల్లాడి మ‌న‌స్త‌త్వం, మ‌న‌సులో ఏదీ పెట్టుకోడ‌ని అరియానా చెప్పుకొచ్చింది. త‌ర్వాత సోహైల్‌.. అరియానా గురించి చెప్తూ ఆమె లోప‌ల ఉన్న ప్రేమ‌ను బ‌య‌ట‌పెట్ట‌ద‌ని చెప్పాడు. త‌ర్వాత‌ అభి గురించి నేను చెప్తానంటే నేను చెప్తాన‌ని అఖిల్‌, హారిక పోట్లాడారు. చివ‌రికి అఖిల్ అందుకుంటూ.. రిజ‌ర్వ్‌డ్‌గా క‌నిపిస్తాడు కానీ అభి ఎమోష‌న‌లేన‌ని, దాన్ని బ‌య‌ట‌పెట్ట‌ట్లేదు అని చెప్పాడు. త‌ర్వాత హారిక‌.. అఖిల్ గురించి చెప్తూ.. అత‌డిని కేర్ తీసుకునేందుకు ఒక‌రు కావాల‌ని ఎదురు చూస్తాడు అని మోనాల్ గురించి ప‌రోక్షంగా చెప్పుకొచ్చింది. అభిజిత్‌.. హారిక గురించి చెప్తూ ఆమె లోప‌ల ఉన్న విష‌యాన్ని బ‌య‌ట పెట్టద‌ని చెప్పాడు. త‌న‌కంటే ఎక్కువ ఇగో ఉంటుంద‌న్నాడు.

ఇక్కడితో ఆగకుండా హౌస్ మేట్స్ కు మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో ఫైన‌లిస్టులు తాము విజేత కావ‌డానికి ఎందుకు అర్హులో చెప్తూ, అర్హ‌త లేని వ్య‌క్తి పేరును చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ లో కూడా అభి మొదట మాట్లాడుతూ…’ఎక్కువ సార్లు నామినేట్ అయి సేఫ్ అయ్యాను. నేను ట్రోఫీ గెలిచేందుకు అర్హుడిని అనుకుంటున్నాను. హారికతో పోటీప‌డ‌టం నేను త‌ట్టుకోలేను. కాబ‌ట్టి నేను గెల‌వాలంటే హారిక‌ అర్హురాలు కావ‌ద్దు’ అని చెప్పాడు. త‌ర్వాత అఖిల్.. టాస్కుల్లో హ‌ద్దులు దాటినందుకు అరియానా అన‌ర్హురాలు అనుకుంటున్నాన‌ని చెప్పాడు. సోహైల్‌.. అరియానా, అభిజిత్ అన‌ర్హులు అని, హారిక.. అరియానా అన‌ర్హురాలు అని చెప్పింది. చివ‌ర‌గా అరియానా మాట్లాడుతూ.. ‘ఆట‌లో నా పేరు గుర్తుండిపోవ‌డం బాగుంది. అంద‌రి బుర్ర‌ల్లోకి నా పేరే వ‌చ్చిందంటే నేను గేమ‌ర్‌నే. అంటే ట్రోఫీ తీసుకునేందుకు నేను అర్హురాలినే’ అని చెప్పుకొచ్చింది. హారిక కొన్నిసార్లు స‌రైన నిర్ణ‌యాలు తీసుకోలేదంటూ ఆమెను అన‌ర్హురాల‌ని ప్ర‌క‌టించింది.

మరి చూద్దాం.. ఎవరు విన్నర్ అవుతారు.. ఎవరు ట్రోఫీని గెలుస్తారు అన్న విషయం తెలియాలంటే మాత్రం ఈ ఆదివారం వరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.