కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 56

సినిమా వార్తలు

ఆదిలాబాద్‌ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన పుష్ప సినిమా చిత్రబృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను‌ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Actress Pooja Hegde Gets Ready For Radhe Shyam Movie Shoot
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ కు రెడీ అయిపోయిన బుట్టబొమ్మ

మొత్తానికి ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలు కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి షూటింగ్ లను ప్రారంభిస్తున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్యాలు అనుమతులు ఇచ్చినా కరోనాకు భయపడి షూటింగ్ లను జరపలేదు. అయితే ఇప్పట్లో కరోనాకు అంతం లేదని భావించి.. తక్కువ మంది స్టాఫ్ తో కరోనాకు తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ లను జరపడానికి రెడీ అయిపోతున్నారు. ఒక పది. పదిహేను రోజుల పెండింగ్ వున్న సినిమాలు అయితే ఇప్పటికే షూటింగ్ ను మొదలు పెట్టి మిగిలిన షూట్ ను పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే హీరోయిన్స్ అందరూ చిన్నగా హైదరాబాద్ లో వాలిపోతున్నారు. దీనిలో భాగంగానే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మిస్సింగ్ ది సెట్స్ -రవితేజ

మాస్ మహారాజా రవితేజ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ లో నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయిక. కొంత షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ ఉండగా కరోనా కారణం గా షూటింగ్ నిలిచిపోయింది. 6నెలల తరువాత షూటింగ్స్ ప్రారంభం కావడంతో "క్రాక్ " మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వీకెండ్ గుడ్ స్టార్ట్ - 108 సూర్య నమస్కారాలు

మన హీరోలే కాదు హీరోయిన్స్ కూడా ఫిట్ నెస్ విషయంలో ఈ మాత్రం తీసిపోరు అని ఇప్పటికే రకుల్, సమంత, రష్మిక, పూజా హెగ్డే ఇలా పలువురు హీరోయిన్స్ నిరూపించారు. ఇక సమంత అయితే ఈ మధ్య యోగా కూడా స్టార్ట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా సమంత సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పోస్ట్ చేస్తూ అందులో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినట్టు తెలుపుతుంది. 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి...ఈ వీకెండ్ కు గుడ్ స్టార్ట్ అంటూ .. తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సంతోష్‌కు ధన్యవాదాలు తెలిపారు.ఇక ఇందుకు స్పందించిన సంతోష్‌.. ‘‘ సరైన దారిలో నడిచేందుకు ఎలాంటి షార్ట్‌కట్లు ఉండవని ఆమె…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అవును టబు పాత్ర కోసం అడిగారు

ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన 'అందాదూన్' సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పవర్' సినిమా నా కెరీర్‌ను మార్చేసింది

సినీ పరిశ్రమలో బాబిగా ఎంట్రీ అయిన ఈ యంగ్ డైరెక్టర్ అతి తక్కువటైంలోనే పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే అవకాశం దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా పవర్ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన బాబి తొలి సినిమాతోనే విజయం అందుకున్నాడు. ఆ తరువాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ వెంటనే ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా తీసి హిట్ కొట్టాడు. గత ఏడాది వెంకీమామ సినిమాతో సందడి చేసాడు.

TFN Adminవాట్సాప్
Actress Andrea Jeremiah Is Set To Pair With Suriya For The First time
సినిమా వార్తలు

స్టార్ హీరో సూర్య కు జోడీగా ఆండ్రియా ?

తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందిన "సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా ) మూవీ అక్టోబర్ 30 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సూర్య తన నెక్స్ట్ మూవీ కి సిద్ధం అవుతున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ కలైపులి S థాను నిర్మాణ సారథ్యంలో బ్లాక్ బస్టర్ "అసురన్ " మూవీ ఫేమ్ వెట్రి మారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా "వాడి వాసల్ " మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ.!

ఒకప్పుడు హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోలు విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించట్లేదు. అంతేకాదు నెగెటివ్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్.

TFN Adminవాట్సాప్
Saaho Movie BGM Haunts Me Till Today Says Music Director Thaman
సినిమా వార్తలు

సాహో 'బీజియం' ఇంకా వెంటాడుతూనే ఉంది

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన భారీ బ‌డ్జెట్ చిత్రం సాహో. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కిన ఈ సినిమా అనేక భాష‌ల‌లో విడుద‌లైన విజ‌య‌బావుటా ఎగుర‌వేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్సే ఉదాహరణ. మొత్తంగా బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కల నెరవేరింది - పాయల్ రాజ్ పుత్

సెన్సేషనల్ హిట్ "RX 100 " మూవీ తో టాలీవుడ్ కు పరిచయమయిన పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యూత్ లో పాయల్ క్రేజీ హీరోయిన్ గా మారారు. "సీత " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ , "వెంకీ మామ ", "డిస్కో రాజా " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పాయల్ ప్రస్తుతం "నరేంద్ర " తెలుగు మూవీ లో నటించారు. "ఏంజెల్ " మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Nikhil Kumaraswamy Starer Rider Movie First Look Motion Poster Is Out.
ఫస్ట్ లుక్

"రైడర్ " మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్

లహరి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో "జాగ్వార్ " మూవీ ఫేమ్ నిఖిల్ కుమార్ గౌడ హీరోగా భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామా "రైడర్ " మూవీ తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతుంది. హీరో నిఖిల్ కుమార్ కు జోడీగా "నర్తనశాల " మూవీ ఫేమ్ కాశ్మీర పరదేశి నటిస్తున్నారు. "రైడర్ " మూవీకి చంద్రు మనోహరన్ నిర్మాత.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'వి' సినిమా చూసి మా పేరెంట్స్ హ్యాపీ

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు.. సూపర్ స్టార్ మహేష్ బాబు బావ అయినా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్ బాబు. తాజాగా వి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. ఓటీటీలో సెప్టెంబర్ 05 న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో శ్రియ కూడా అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
Pawan Kalyan Initiative Gets Good Response From Public
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ దీప ప్రజ్వలన పిలుపుకు అద్భుత స్పందన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. "జనసేన "పొలిటికల్ పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్ " మూవీ తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. "వకీల్ సాబ్ " మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ మరో 3,4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక అంశాల పై స్పందించే పవన్ కళ్యాణ్ అంతర్వేది లో జరిగిన సంఘటనకు స్పందించి భారతీయ సంస్కృతి , సనాతన ధర్మ పరిరక్షణకై దీప ప్రజ్వలన చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్

కోట్లాది అభిమానులు అభిమానించే మెగా స్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాలు సినిమాలకు దూరం అయ్యి బ్లాక్ బస్టర్ "ఖైదీ నెం 150 "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలకు కానీ సోషల్ మీడియా కు కానీ చాలా కాలం పాటు దూరంగా ఉన్న చిరంజీవి మూవీ తో పాటు సోషల్ మీడియా లో ఎంటర్ అయ్యారు. సోషల్ మీడియా లో ఎంటర్ అయిన 24 గంటలలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకొన్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ala Vaikunthapurramuloo Actress Pooja Hegde Turns Chef For Her Father
సినిమా వార్తలు

తండ్రి కోసం చెఫ్ గా మారిన బుట్టబొమ్మ

లాక్ డౌన్ లేకపోతే ఎప్పుడూ షూటింగ్ లు అంటూ బిజీగా వుండే హీరోయిన్స్ లాక్ డౌన్ లో మాత్రం గరిటె పట్టుకొని చెఫ్ లుగా మారిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ వంటలు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిన సందర్భాలు వున్నాయి. ఇక్కడ మరో హీరోయిన్ కూడా చెఫ్ గా మారిపోయింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు బుట్టబొమ్మ అదే పూజా హెగ్డే. ఖాళీ టైం దొరకడంతో వంటగదిలో ప్రయోగాలు చేస్తూ సరికొత్త వంటకాలను పరిచయం చేస్తోంది. తాజాగా తన తండ్రి కోసం జానీ వాకర్ టామెరెండ్ హై బాల్ అనే ప్రిపేర్ చేసి ఇచ్చినట్టు తెలిపింది. అంతేకాదు ఎలా చేయాలో ప్రాసెస్ కూడా చెప్పింది. మరి ఫ్యాన్స్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈవారం ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ మీకోసం

ఈ వారం టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అయ్యారా. అయితే ఈ వారంలో వచ్చిన అప్ డేట్స్ మీకోసం మరోసారి అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ బాక్సింగ్ ట్రైనింగ్

2011 లో అనగనగా ఓ ధీరుడు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శృతిహాసన్ ఆ తరువాత తక్కువ కాలంలోనే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే 2017 లో కోలీవుడ్‌లో ‘సింగం 3’, టాలీవుడ్‌లో ‘కాటమరాయుడు’, బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తెరి’ సినిమాల్లో సందడి చేసిన ఆమె ఆ తరువాత ఎలాంటి ప్రాజెక్టుకు సంతకం చేయలేదు. దానికి రిలేషన్ షిప్ లో ఉండటం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఇక బ్రేకప్ తర్వాత గ్యాప్ తీసుకున్న శృతి మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మనోజ్ హై కిక్ - సీరియ‌స్ వర్కౌట్స్

చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా 'అహం బ్రహ్మస్మి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బిగ్ స్టార్స్ తో చేయడం నా డ్రీం కాదు

సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా పెద్ద పెద్ద స్టార్స్ తో చేయాలన్న డ్రీం ఉంటుంది. కానీ నాకు అలాంటి డ్రీం ఏం లేదు.. టాలెంటెడ్ నటీ నటులను సినిమాకు పరిచయం చేయడమే తన డ్రీం అంటున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు సహజత్వానికి దగ్గరగా సినిమాలు తీసే ఇంద్రగంటి మోహన్ కృష్ణ. మరి ఇంద్రగంటి సినిమాలు చూస్తేనే చెప్పొచ్చు తను ఇలాంటి వ్యాఖ్యలు చేయడంలో ఎలాంటి తప్పు లేదని. తాజాగా 'దితెలుగుఫిలింనగర్.కామ్' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇంద్రగంటి.

TFN Adminవాట్సాప్

షేర్