ఆయుష్మాన్ ఖురానా,టబు, రాధికా ఆప్టే నటించిన ‘అందాదూన్’ సినిమా మంచి ప్రేక్షకాదరణతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గాను రీసెంట్ గా ఆయుష్మాన్ ఖురానాకు నేషనల్ అవార్డ్ దక్కింది. మరి ఒక భాషలో హిట్ అయిన సినిమాలు వేరే భాషల్లో కి రీమేక్ చేయడం కామన్ థింగ్ కాబట్టి ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో అందాదూన్ రీమేక్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో టబు ది కీలక పాత్ర అని తెలుసు కదా. ఇక ఈ పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే పలువురు పేర్లు తెరపైకి వచ్చిన సంగతి కూడా విదితమే. రీసెంట్ గా శ్రీయ పేరు కూడా వినిపించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న శ్రీయ దీనిపై మాట్లాడుతూ.. అవును టబు పాత్ర కోసం నన్ను అడిగారు.. అయితే ఇంకా ఫైనల్ కాలేదు.. ప్రస్తుతం షూటింగ్స్ లేవు.. థియేటర్స్ లేవు.. నేను బార్సిలోనా లో వున్నా… అన్ని పరిస్థితులు బావుంటే అప్పుడు అక్కడికి రావాలి.. చూడాలి అని తెలిపింది. టబు పాత్రలో నటించడం గొప్ప విషయం.. తన అన్ని సినిమాలు నేను చూసాను.. తన నటన చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది.. నాలా నేను నటించడానికి ట్రై చేస్తా.. లేకపోతే తననే ఇమిటేట్ చేస్తా.. అని చెప్పుకొచ్చింది. మరి శ్రీయ ఇంత చెపుతుంది అంటే పక్కాగా ఆమెనే ఫిక్స్ అనినట్టు అనిపిస్తుంది కదా. చూద్దాం త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో.
కాగా లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుంది శ్రియ. రియల్ లైఫ్ డ్రామాగా సుజనా రావు డైరెక్ట్ చేస్తున్న ‘గమనం’ చిత్రంలో శ్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ చేతుల మీదుగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగియగా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఈ చిత్రానికి పనిచేస్తున్న జ్ఞానశేఖర్ వి.ఎస్. నిర్మాత అవతారం కూడా ఎత్తి, రమేష్ కరుటూరి, వెంకీ పుషడపు లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: