మనోజ్ హై కిక్ – సీరియ‌స్ వర్కౌట్స్

Tollywood Actor Manchu Manoj Shares A Pic From His Workout Session With A Quirky Caption

చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మనోజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరో గా ‘అహం బ్రహ్మస్మి’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అయితే ఇంత వరకూ షూటింగ్ ప్రారంభించలేదు కానీ.. సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మాత్రం రిలీజ్ చేసేశారు. రెండిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్యాప్ తీసుకున్నా మనోజ్ మాత్రం మంచి కథతో వస్తున్నాడన్న హోప్స్ పెంచాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక లాక్ డౌన్ వల్ల ఇన్నిరోజులు షూటింగ్ లు జరగలేదు.. ఇప్పుడే మెల్ల‌మెల్ల‌గా సినీ ఇండ‌స్ట్రీలో షూటింగ్స్ మొద‌ల‌వుతున్నాయి. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్స్ లో పాల్గొనేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇక యాక్ష‌న్ ఓరియెంటెడ్ ఎలిమెంట్స్ తో వస్తున్నఈ సినిమా కోసం మ‌నోజ్ సీరియ‌స్ వ‌ర్క‌వుట్స్ ప్రారంభించాడు. ఈ సినిమా కోసం మేకోవర్ పూర్తిగా మార్చడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో.. త‌న ట్రైన‌ర్ సార‌థ్యంలో హై కిక్ ను ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు ప్రియ‌మైన ప్ర‌జ‌ల‌కు గుడ్ మార్నింగ్..రైజ్ అండ్ షైన్..బ్యూటీఫుల్ డే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

 

కాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాను ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 6 =