పవన్ కళ్యాణ్ దీప ప్రజ్వలన పిలుపుకు అద్భుత స్పందన

Pawan Kalyan Initiative Gets Good Response From Public

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. “జనసేన “పొలిటికల్ పార్టీ స్థాపించి పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 3 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ ” మూవీ తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. “వకీల్ సాబ్ ” మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ మరో 3,4 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సామాజిక అంశాల పై స్పందించే పవన్ కళ్యాణ్ అంతర్వేది లో జరిగిన సంఘటనకు స్పందించి భారతీయ సంస్కృతి , సనాతన ధర్మ పరిరక్షణకై దీప ప్రజ్వలన చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సనాతన ధర్మం , మత సామరస్యం కాపాడడానికై , దేవాలయాలపై దాడులకు నిరసనగా పవన్ కళ్యాణ్ దీప ప్రజ్వలన కార్యక్రమానికి అద్భుత స్పందన లభించింది. పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో దీపం వెలిగించారు. “వకీల్ సాబ్ ” మూవీటీమ్ , హీరో రామ్ చరణ్ మాతృమూర్తి సురేఖ గార్ల తో పాటు జనసేన కార్యకర్తలు , అభిమానులు , ప్రజలు పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అంతర్వేది లో జరిగిన సంఘటన పై రాష్ట్ర ప్రభుత్వం సి బి ఐ ఎంక్వైరీ కై ఆదేశించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =