తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా ) మూవీ అక్టోబర్ 30 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సూర్య తన నెక్స్ట్ మూవీ కి సిద్ధం అవుతున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ కలైపులి S థాను నిర్మాణ సారథ్యంలో బ్లాక్ బస్టర్ “అసురన్ ” మూవీ ఫేమ్ వెట్రి మారన్ దర్శకత్వంలో సూర్య హీరోగా
“వాడి వాసల్ ” మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జల్లికట్టు ఆధారంగా రూపొందనున్న ఈ మూవీ లో హీరో సూర్య తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హీరో సూర్య కు జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆండ్రియా ఎంపిక అయినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ లో హీరో సూర్య , ఆండ్రియా క్యారెక్టర్స్ కు సమాన ప్రాధాన్యత ఉంటుందనీ , త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుందనీ సమాచారం. ఆండ్రియా ప్రస్తుతం 5 తమిళ చిత్రాలలో నటిస్తున్నారు. సూపర్ హిట్ “తడాఖా “, “గృహం ” మూవీస్ ద్వారా ఆండ్రియా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: