ఆర్ఆర్ఆర్ లో నాపాత్ర చిన్నదే కానీ..!

Actress Shriya Saran To Do Cameo Appearance In Rajamouli Magnam Opus RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత పాత్రల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో శ్రియ కూడా అతిధి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియ తన పాత్రపై మాట్లాడుతూ.. ఇక తనపాత్రపై ఆర్ఆర్ఆర్ సినిమాలో అతిధి పాత్ర అయినా ఎస్.ఎస్ రాజమౌళితో మళ్లీ వర్క్ చేయడం గ్రేట్ ఫీలింగ్.. రాజమౌళి ఎప్పడూ డిఫరెంట్ గా చేయడానికే ప్రయత్నిస్తాడు. ఈ సినిమా లో నాది చిన్న రోలే.. అజయ్ దేవగన్ తో సన్నివేశాలు ఉంటాయి అని తెలిపింది. రామ్ చరణ్ , తారక్ తో పనిచేసే ఛాన్స్ లేదు.. కానీ ఈ సినిమాలో వారిద్దరూ పాత్రలు చాలా గొప్పగా ఉంటాయి.. సెట్స్ లో ఉనప్పుడు స్పెషల్ ప్రాజెక్ట్ లో నేను కూడా భాగమయ్యాఅన్న ఫీలింగ్ వచ్చింది. ఈ పరిస్థితులు చక్కబడితే మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తారు అని చెప్పుకొచ్చింది.

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + six =