ఈవారం ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ మీకోసం

Remove term: Important Telugu Movie Updates In This Week Important Telugu Movie Updates In This Week

ఈ వారం టాలీవుడ్ అప్ డేట్స్ మిస్ అయ్యారా. అయితే ఈ వారంలో వచ్చిన అప్ డేట్స్ మీకోసం మరోసారి అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిరు న్యూ లుక్

మెగా స్టార్ చిరంజీవి కొత్త లుక్ తో ప్రేక్షక, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అర్బన్ మాంక్ హ్యాష్ ట్యాగ్ తో గుండు తో ఉన్న తన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో లో షేర్ చేశారు. అయితే చిరు నిజంగా గుండు చేయించుకున్నారా..? ఏదైనా మూవీ షూటింగ్ కు సంబంధించిన ఫొటోనా అన్నది సస్పెన్స్.

‘ఓటీటీ’ లో ఒరేయ్ బుజ్జిగా

విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ‘ఒరేయ్‌.. బుజ్జిగా’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కూడా ఓటీటీ లో రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఆహా లో అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

 

రాబోతున్న జెంటిల్‌మేన్‌ 2

శంకర్ దర్శకత్వంలో అర్జున్‌, మధుబాల హీరో హీరోయిన్లుగా వచ్చిన జెంటిల్‌మేన్‌ సినిమా తమిళ, తెలుగు భాషల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. అర్జున్ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. ఇక ఇప్పుడు జెంటిల్‌మేన్‌కు పార్ట్ 2గా, మొదటి భాగానికి రెండింతలు ఉండేలా జెంటిల్‌మేన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు నిర్మాత కేటి కుంజుమోన్.

సంప‌త్ ‌నంది ‘థ్రిల్లర్’ సినిమా ‘ఓదెల రైల్వేస్టేష‌న్’

సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. ఏమైంది ఈవేళ‌, బెంగాల్ టైగ‌ర్ వంటి సూప‌ర్‌హిట్స్ అందించిన శ్రీ‌స‌త్య‌సాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహ‌న్ ప్రొడ‌క్ష‌న్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసాడు సంపత్ నంది. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్గా వస్తున్న ఈ సినిమాకు ‘ఓదెల రైల్వేస్టేష‌న్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

 

సురేందర్ రెడ్డి-అఖిల్ సినిమా అనౌన్స్ మెంట్
.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా సినిమా కన్ఫామ్ అయింది. భారీ సినిమా రూపొందనున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టొరీ అందించినట్టు తెలుస్తుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

 

శ్రియ కొత్త సినిమా ‘గ‌మ‌నం’

లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇవ్వబోతుంది శ్రియ. రియ‌ల్ లైఫ్ డ్రామాగా సుజ‌నా రావు డైరెక్ట్ చేస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రంలో శ్రియ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రియ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ క్రిష్ చేతుల మీదుగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత

గుంటూరు లో జయప్రకాశ్ రెడ్డి గుండె పోటు తో మృతి చెందారు. జయ ప్రకాశ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. వైవిధ్య భరిత పాత్రలలో నటించే ఒక సీనియర్ నటుడు జయప్రకాశ్ ను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. “బ్రహ్మపుత్రుడు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జయ ప్రకాశ్ రెడ్డి విలన్, కామెడీ విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాయలసీమ స్లాంగ్ తో డైలాగ్స్ చెబుతూ ప్రేక్షకులను అలరించారు.

బాలుకి కరోనా నెగిటివ్

గ‌త కొద్ది రోజులుగా క‌రోనాతో బాలు ఎంజీఎం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక బాలు ఆరోగ్యంపై తనయుడు ఎస్పీ చరణ్ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్న సంగతి కూడా విదితమే. ఈనేపథ్యంలోనే గుడ్ న్యూస్ చెప్పారు. నాన్నగారికి కరోనా నెగిటివ్ అని వచ్చింది. కరోనా పరీక్షలు నిర్వహించిన ఆస్పత్రి వైద్యులు నాకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ముందుతో పోలిస్తే నాన్న ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గానే ఉంది. అయితే వెంటిలేటర్ తొలగిస్తారని భావించాం కానీ ఇంకా ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ ఉండటంతో అది సాధ్యం కాలేదని తెలిపారు.

ఫారెస్ట్ ను దత్తత తీసుకున్న ప్రభాస్

గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ మొక్కలు నాటిన సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసాడు. అంతే కాదు ఒక పార్క్ ను కూడా దత్తత తీసుకుంటానని చెప్పిన సంగతి కూడా విదితమే. ఇందులో భాగంగానే కాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కును దత్తత తీసుకున్నాడు. అంతేకాదు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, ఎంపీ సంతోశ్‌కుమార్‌తో క‌లిసి హీరో ప్ర‌భాస్ శంకుస్థాప‌న చేశారు. 1,650 ఎకరాల అటవీ భూమిని ద‌త్త‌త తీసుకొని త‌న తండ్రి పేరిట అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌క్ష‌ణ సాయంగా రూ.2 కోట్లు అంద‌జేసిన‌ ప్ర‌భాస్.. అవ‌స‌రాన్ని బ‌ట్టి మ‌రింత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.

 

వెంకీ 75 పై క్లారిటీ

వెంకీ 75 సినిమాపై గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా రూపొందిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద హారికా అండ్‌ హాసినీ క్రియేషన్‌ నిర్మాత వంశీ క్లారిటీ ఇచ్చాడు. `వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లోని సినిమా గురించి మీ ఆసక్తిని అర్థం చేసుకోగలం. అయితే వెంకీ 75వ సినిమా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా తర్వాతి ప్రాజెక్టు గురించి మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ప్రకటిస్తాం. అప్పటివరకు వేచి ఉండండ`ని ట్వీట్ చేశాడు.

 

‘మహాసముద్రం’ అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఫైనల్లీ మహాసముద్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ సినిమాపై గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ఇక ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. ఇంతకాలం తర్వాత ఎట్టకేలకు అఫీషియల్ గా ప్రకటించారు. శ‌ర్వానంద్ హీ‌రోగా, అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ప్రకటించింది. ‘ప్రస్థానం’, ‘గ‌మ్యం’ చిత్రాల త‌ర్వాత శ‌ర్వానంద్ చిర‌కాలం గుర్తుండిపోయే ఉద్వేగ‌భ‌రిత‌మైన‌, బ‌ల‌మైన పాత్రను చేసేందుకు సిద్ధమ‌వుతున్నారు. ఇందులో ఛాలెంజింగ్ రోల్‌ను చేయ‌బోతున్నందుకు శ‌ర్వానంద్ అమితోత్సాహంతో ఉన్నారు అని ట్వీట్ లో పేర్కొన్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =