నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ.!

I am ready to play negative shaded roles says actor satyadev

ఒకప్పుడు హీరోలు నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలంటే కాస్త ఆలోచించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. హీరోలు విలన్ పాత్రలు చేయడానికి కూడా ఏమాత్రం ఆలోచించట్లేదు. అంతేకాదు నెగెటివ్ రోల్స్ చేస్తామని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మరో హీరో కూడా నెగెటివ్ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు సత్య దేవ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సత్వ దేవ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇటీవల ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్వ దేవ్ నెగిటివ్ రోల్స్ చేయడానికి నేను రెడీ అని చెప్పి అందరికీ షాకిచ్చాడు. కథానాయకుడికి తగిన ప్రతినాయకుడి పాత్ర ఉంటే ఆ పాత్రలు చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అని చెప్పాడు. మరి సత్యదేవ్ గురించి అలాంటి పవర్ ఫుల్ విలన్ పాత్ర ఎవరు రాస్తారో చూద్దాం.

ప్రస్తుతం టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈ సినిమా రీమేక్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా దీనితో పాటు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేయనున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాను ప్రకటన చేశారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు ‘తిమ్మరుసు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − two =