అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన పుష్ప సినిమా చిత్రబృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా బన్నీ మాత్రం ఇంకా ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ అండ్ ఫామిలీ ఆదిలాబాద్ లోని కుంతల వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్లారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అభయారణ్యం వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక బన్నీ అక్కడకు రావడంతో అభిమానులు అక్కడికి చేరుకొని హీరో అల్లు అర్జున్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఇప్పుడు బన్నీ పర్యటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే బన్నీ అక్కడికి వెళ్లడంతో పుష్ప సినిమా లొకేషన్స్ కోసం వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదని.. కేవలం ఫ్యామిలీ టూర్ మాత్రమే అంటున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: