బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం సాహో. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో.. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా అనేక భాషలలో విడుదలైన విజయబావుటా ఎగురవేసింది. మొత్తం నాలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు నిజానికి సౌత్ లో కంటే నార్త్ లోనే ఎక్కువ ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. దానికి హిందీలో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్సే ఉదాహరణ. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా విడుదలై ఏడాది అయిపోయినా ఇంకా ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా తనను వెంటాడుతూనే ఉందంటున్నాడు థమన్. అంతేకాదు ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా చెప్పడం విశేషం. సాహో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటూ ఉన్న వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఇంకా సాహూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నన్ను వెంటాడుతూనే ఉంది.. నాకు మంచి ఎనర్జి ఇస్తుంది అంటూ తెలిపాడు.
Still haunts Me & Gives me all the needed high for the day ♥️ #shadesofsaahobgm !!! 🧨🧨🧨🧨 pic.twitter.com/io6XW3T2s4
— thaman S (@MusicThaman) September 12, 2020
వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు థమన్. ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా థమన్ ను మరో మెట్టు ఎక్కించింది. ఇక ఇప్పుడు డజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్” సోలో బతుకే సో బెటర్”, రవితేజ మూవీ “క్రాక్”, కీర్తి సురేష్ “మిస్ ఇండియా” , నాని “టక్ జగదీష్”, వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించనున్న మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా సెట్స్ పైకి రాని సూపర్ స్టార్ మహేష్ బాబు #SSMB 27, యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకు కూడా థమన్ ను అనుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: