గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా ‘నిశ్శబ్దం’ ట్రైలర్

Anushka Shetty Nishabdham Movie Trailer Is Out

ఎంతో సస్పెన్స్ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. రానా దగ్గుబాటి తన ట్విట్టర్‌ ద్వారా ట్రయిలర్ విడుదల చేసి యూనిట్‌ను అభినందనలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ట్రయిలర్ విషయానికొస్తే మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సినిమాపై అంచనాలు పెంచేసింది. అనుష్క, మాధవన్‌ల నటన, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ బాగున్నాయి. అనుష్క బెస్ట్‌ ఫ్రెండ్ సోనాలి పాత్రలో షాలినిపాండే నటించింది. మాధవన్‌, అనుష్క ఓ దెయ్యముండే ఇంట్లోకి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? సోనాలి ఎందుకు కనపడకుండా పోయింది? అనే విషయాలను ఆసక్తికరంగా ఉండేలా ట్రైలర్‌ను కట్‌ చేశారు. మాటలురాని, వినికిడి లోపం కలిగిన పాత్రలో అనుష్క నటన సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది. ట్రైలర్ అయితే ఆకట్టుకునేలా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకూ వెయిట్ చేయాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో అంజలి, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 4 =