“ప్రేమతో మీ కార్తీక్ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కార్తికేయ సూపర్ హిట్ “RX 100 మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తో కార్తికేయ కు యూత్ లో క్రేజ్ పెరిగింది. “హిప్పీ “, గుణ 369 “, “90 ML ” మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. కార్తికేయ ప్రస్తుతం “చావు కబురు చల్లగా ” మూవీ లో
ఒక మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు కార్తికేయ బర్త్ డే సందర్భంగా ఒక కొత్త మూవీ అనౌన్స్ అయ్యింది. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ పై శ్రీ సరిపల్లి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక మూవీ తెరకెక్కనుంది. తాన్యా రవి చంద్రన్ కథానాయిక. సాయి కుమార్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో హీరో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు. డిఫరెంట్ కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ
ప్రేక్షకులను అలరిస్తున్న కార్తికేయ కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుదాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: