మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ ఎంత ఘనవిజయం సాధించిందో తెలుసు. జీతూజోసఫ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా సీక్వెల్ రాబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి ఎప్పుడో షూటింగ్ మొదలవ్వాలి అయితే కరోనా వల్ల ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలుపెడుతున్నారు కాబట్టి ఇక ఈ సినిమాను కూడా మొదలు పెట్టారు. ఈరోజు పూజా కార్యక్రమాలు ముగించుకొని షూటింగ్ కూడా ప్రారంభించారు. ఈ విషయాన్ని మమ్ముట్టి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
Glad to share that we have started the #shooting of #Drishyam2 today. Here are some of the Pooja Pics.#Drishyam pic.twitter.com/GF5B5k4SpH
— Mohanlal (@Mohanlal) September 21, 2020
కాగా ఈ సినిమాకు కూడా ‘జీతూ జోసఫ్’ దర్శకత్వం వహించనున్నారు. ఆంటోనీ పెరంబవూర్ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ను కూడా త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తి చేసే యోచనలో ఉన్నారట చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: