‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

Kartikeya Gummakonda Chavu Kaburu Challaga Movie First Glimpse Is Out

కౌశిక్ పెగళ్ళపాటి దర్శకత్వంలో కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడగా..త్వ‌ర‌లోనే తిరిగి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించి, శ‌ర‌వేగంగా చిత్రీక‌రణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈసినిమాలో బస్తీ బాలరాజు గా ఒక పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కార్తికేయ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తామని చెప్పిన సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఈరోజు సెప్టెంబ‌ర్ 21న హీరో కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా వ‌రల్డ్ ఆఫ్ బస్తీ బాల‌రాజు పేరుతో పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెష‌ల్ వీడియోని విడుద‌ల చేశారు చిత్ర బృందం. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక వీడియోను బట్టి చూస్తే ఈ సినిమాలో కూడా కార్తికేయ పాత్ర కాస్త బోల్డ్ గానే ఉన్నట్టు అర్ధమవుతుంది.

 

కాగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించనున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + thirteen =