బిగ్ బాస్ 4.. కిక్ లేని కెప్టెన్సీ టాస్క్ – కెప్టెన్ గా గంగవ్వ

Gangavva Becomes The New Captain Of Bigg Boss 4 Season Show Gangavva Becomes The New Captain Of Bigg Boss 4 Season Show

ఇక రెండు రోజులు కెప్టెన్సీ టాస్క్ తో మంచి హీట్ మీదున్న బిగ్ బాస్ హౌస్ నిన్న ఎపిసోడ్ మాత్రం కాస్త కూల్ గా ముగిసింది. ఇక టాస్క్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ గా నిలిచిన గంగవ్వ, హారిక, అవినాష్, అభిజిత్‌లకు రంగు పడుద్ది అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్‌లో భాగంగా న‌లుగురికి రంగు నీళ్ళ‌తో నిండిన బౌల్స్ ఇవ్వ‌గా, చివ‌రి వ‌ర‌కు ఎవ‌రు నీళ్లు కింద ప‌డ‌కుండా ఉంచుకుంటారో వారే విజేత‌ల‌ని ప్ర‌క‌టించారు. ఇంటి సభ్యులు అందరూ గంగవ్వను కెప్టెన్‌గా నిల‌బెట్టే క్ర‌మంలో హారిక, అవినాష్, అభిజిత్‌ బౌల్స్‌లో ఉన్న రంగు నీళ్లను ప‌డేశారు. దీంతో గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బిగ్ బాస్ జైలు నుండి నోయ‌ల్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. జైలు నుండి విడుద‌ల‌య్యే ముందు హౌజ్‌మేట్స్ అంద‌రు నోయ‌ల్‌తో క‌లిసి ప్లెడ్జ్ చేశారు. అనంత‌రం గంగ‌వ్వ.. ‘ఉక్కు హృదయం’ టాస్క్‌లో ఎవరు ఎలా బిహేవ్ చేశారో అనుక‌రించి అందర్నీ నవ్వించే ప్ర‌య‌త్నం చేసింది.

ఇక హీరోయిన్ స్వాతి దీక్షిత్‌ను మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు. ఆమెను ఎవ‌రైతే ఇంప్రెస్ చేస్తారో వారికి ఆ స‌ర్‌ప్రైజ్ ఉంటుంద‌ని అన్నారు. ఇక స్వాతిని ఇంప్రెస్ చేసేందుకు అఖిల్‌, అభి, నోయ‌ల్ పాట‌లు పాడ‌గా మెహ‌బూబ్..100 డిప్స్ నాన్‌స్టాప్‌గా కొట్టాడు. ఇక అవినాష్ ఆమెను కొంత న‌వ్వించాడు. రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ ఆమె గురించి ఫిదా అయ్యేలా చేశాడు. స్వాతి మాత్రం అఖిల్, అవినాష్, రాజశేఖర్ మాస్టర్, నోయల్‌లకు ఇంప్రెస్ అయినట్టు చెప్పి వాళ్లకి రెడ్ రోజ్‌లు అందించింది. న‌లుగురితో స్వాతి పార్టీని ఎంజాయ్ చేసింది.

ఇక ఈ రోజు శనివారం. మరి హోస్ట్ నాగార్జున ఈ వారం టాస్క్ గురించి క్లాస్ తీసుకుంటారా లేక ఎప్పటిలాగే గేమ్స్ ఆడిస్తూ.. కూల్ గా మాట్లాడుతూ కానిచ్చేస్తాడా చూద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =