త్వరలో “రంగ్ దే ! సెట్స్ లో కీర్తి సురేష్

Actress Keerthy Suresh To Join Rang De Movie Shoot Soon.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ , కీర్తి సురేష్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “రంగ్ దే !” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. నరేష్ , రోహిణి , వినీత్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ ఈ మూవీ కి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ నిలిచిపోయిన “రంగ్ దే !” మూవీ 6 నెలల తరువాత సేఫ్టీ ప్రికాషన్స్ తో షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది . హీరోయిన్ కీర్తి సురేష్ కొన్ని రోజులలో షూటింగ్ లో పాల్గొంటారని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం నితిన్ , కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. ” భీష్మ ” మూవీ తో విజయం సాధించిన నితిన్ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి , కృష్ణ చైతన్య , మేర్లపాక గాంధీ మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కీర్తి సురేష్ నటించిన “మిస్ ఇండియా “, గుడ్ లక్ సఖి ” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి నటిస్తున్న “అన్నాత్తే “(తమిళ ), “మరక్కార్ “(మలయాళ ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. హీరో నితిన్ , కీర్తి ఫస్ట్ టైమ్ జంటగా రూపొందుతున్న “రంగ్ దే !” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − three =