US రియల్ లొకేషన్స్ లో “నిశ్శబ్ధం” షూటింగ్

Nishabdham Movie Was Shot At Real Locations of US

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” భారీ అంచనాలతో అక్టోబర్ 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ప్రధాన పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. హీరోయిన్ అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నిశ్శబ్ధం” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడు హేమంత్ మధుకర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. యునైటెడ్ స్టేట్స్ లో “నిశ్శబ్ధం” మూవీ పూర్తిగా షూటింగ్ జరుపుకుందనీ , సెట్స్ ఏమీ రూపొందించకుండా సియోటెల్ శివార్లలలో రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగిందనీ , షూటింగ్ లో పాల్గొన్న కాప్స్ రియల్ కాప్సేననీ , 56 రోజులలో షూటింగ్ కంప్లీట్ అయ్యిందనీ, మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోయిన్ అనుష్క సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్ లలో ట్రైనింగ్ పొందారనీ , స్క్రిప్ట్ తో పాటు ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ , సౌండింగ్ , సినిమాటోగ్రఫీ “నిశ్శబ్ధం” మూవీ కి హైలైట్ అనీ , అనుష్క డెడికేషన్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారనీ, “నిశ్శబ్ధం” మూవీ కి అనుష్క లైఫ్ లైన్ అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + six =