యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ లో వర్కౌట్స్ , కుకింగ్ వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు. శృతి ప్రస్తుతం హీరో రవితేజ “క్రాక్ “, విజయ్ సేతుపతి “లాభం “తమిళ మూవీ లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీలో శృతి హాసన్ కథానాయిక గా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ జంటగా రూపొందిన “గబ్బర్ సింగ్ “, “కాటమ రాయుడు ” మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు “వకీల్ సాబ్ ” మూవీ తో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. అక్టోబర్ నెలలో శృతి “వకీల్ సాబ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. సోషల్ మీడియా లో తన లేటెస్ట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తున్న శృతి ఇప్పుడు ఒక ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించిన తన వైట్ డ్రెస్ ఫొటోలతో ఏంజెల్ గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























