తెలుగు సినీ ప్రేక్షకులను తన గాత్రంతో ఆరు దశాబ్దాలుగా అలరిస్తూ.. గాయకుడిగా ఎన్నో శిఖరాలని అధిరోహించిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్ళారు. ఆయన సినీ ప్రయాణంలో తెలుగు, మలయాళ, తమిళం ఇలా దాదాపు 16 భాషలల్లో 45 వేలకు పైగా పాటలు పాడి బాలు లాంటి మరొక సింగర్ లేరు ఇకపై రారు అనేంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఏ హీరోకు తగినట్టు ఆ హీరోకు పాటలు పాడటం.. పాటలో మాడ్యులేషన్స్.. హీరోనే ఆ పాట పాడుతున్నాడా అనేలా ఉండటం.. ఇలా ఒకటేమిటి బాలును గాన గంధర్వుడిగా చేసిన క్వాలిటీస్ ఎన్నో. అలాంటి గాయకుడు ఇప్పుడు మన మధ్య లేరనే వార్త సినీ ఇండస్ట్రీస్ ను మాత్రమే కాదు ప్రతి ఒక్కరినీ బాధిస్తున్న విషయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్పీ బాలు మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇక బాలు మృతిపై నయనతార కూడా స్పందించి సంతాపం తెలియచేసింది. డివైన్ లాంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ ఇక లేదు.. బాలు గారు వాయిస్ ఆఫ్ ఆల్ రీజన్స్.. వాయిస్ ఆఫ్ ఆల్ సీజన్స్ లాంటి వారు.. మనందరం మన ఎమోషన్స్ ను ఒక వాయిస్ తోనే కనెక్ట్ అయి ఉన్నాం అది ఎస్పీ గారి గొంతుతో మాత్రమే.. మీరు లేరు అనే విషయం నమ్మడానికి కష్టంగా ఉంది. అయితే ఆయన లేకపోయినా ఆయన గానం మాత్రం మనతోనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలు మీరు మా కోసం విరామం లేకుండా పనిచేశారు. ఇప్పుడు మీ ఆత్మకు శాంతి లభించాలని మేం కన్నీటి వీడ్కోలు ఇస్తున్నాం. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి` అని నయన్ పేర్కొంది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. శుక్రవారం మధ్యా హ్నం 1:04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇక తిరువళ్ళూరు జిల్లా తామరైపాక్కం ఫాం హౌజ్‌లో అంత్య క్రియలు నిర్వహించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: