వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్‌’‌ ట్రైలర్ రిలీజ్

Ram Gopal Varma Disha Encounter Movie Trailer Is Out

సమాజంలో జరిగే యదార్ధ సంఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట అని చెప్పొచ్చు. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో సంచలన కథతో రాబోతున్నాడు వర్మ. గత ఏడాది దిశ హత్యాచారం సంఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అదే సంఘటన ఆధారంగా రామ్ గోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్‌’‌ అనే సినిమా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకూ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశాడు వర్మ. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు అన్నీ ట్రైలర్ లో చూపించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ లో సోనియా ఆకుల నటించగా.. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిశ’ ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు. మరి చూద్దాం ఈ సినిమా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో.

 

ఇక ఈ లాక్ డౌన్ లో వరుసగా సినిమాలు షూటింగ్ లు చేశారంటే అది వర్మ మాత్రమే. ప్రస్తుతం వర్మ ప్రకటించిన వాటిలో ‘కరోనా’ ‘మర్డర్’ ‘కిడ్నాపింగ్ ఆఫ్ కత్రినా కైఫ్’ ‘ది మ్యాన్ హూ కిల్లుడ్ గాంధీ’, 12 ‘O’ క్లాక్, ‘పవర్ స్టార్’,’డేంజరస్’ అనే సినిమాలు వున్నాయి. మరి ఇన్ని సినిమాల్లో ఎన్ని సినిమాలు విడుదల అవుతాయో.. ఏంటో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =