గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆగష్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన బాలు ఆరోగ్య పరిస్థితులు అప్పటినుండి బాలేదనే చెప్పొచ్చు. ఇటీవల కరోనా నెగిటివ్ వచ్చినా కూడా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీనితో నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు నేడు తుది శ్వాస విడిచినట్లు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక బాలు మరణంతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు సినీ సంగీత రంగంలో బాలు లాంటి మహోన్నత గాయకుడు లేడు.. ఇకపై రాడు. విలక్షణమైన గాత్రంతో ఐదు దశాబ్ధాలుగా అలరిస్తూ వస్తున్న బాలు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ ఇలా 11 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. కేవలం సింగర్ గానే కాదు నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో 50 సినిమాలు, తమిళంలో 14, హిందీలో 5, కన్నడంలో 9 సినిమాలలో నటించారు. కమల్ హాసన్, రజినీ కాంత్, జెమినీ గణేశన్ లకు గాత్రదానం కూడా చేశారు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులను సొంతంచేసుకున్నారు. 2001 లో పద్మ శ్రీ, 2011 లో పద్మ భూషణ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. తల్లి పేరు శకుంతలమ్మ. బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి. బాలు పిల్లల పేర్లు చరణ్, పల్లవి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: