“RED ” మూవీ దీపావళికి థియేటర్స్ లో రిలీజ్ ?

Ram Pothineni Red Movie To Hit Theatres For This Diwali

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది. హీరో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో నివేత పేతురాజ్ , మాళవిక శర్మ , అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్ , నాజర్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర లలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. సూపర్ హిట్ “తడమ్ “తమిళ మూవీ కి తెలుగు రీమేక్ గా “RED ” మూవీ రూపొందింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా కారణంగా థియేటర్స్ క్లోజ్ అయ్యి మూవీ రిలీజ్ లు ఆగిపోవడంతో చాలామంది నిర్మాతలు OTT ల ద్వారా సినిమాలు రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. “RED ” మూవీ కి OTT లో మంచి ఆఫర్ ఉన్నా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఇప్పుడు అక్టోబర్ 15 వ తేదీ థియేటర్స్ రీ ఓపెనింగ్ కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. “RED ” మూవీ దీపావళి పండగకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సుమారు 7 నెలల తరువాత థియేటర్స్ లో రిలీజ్ అయ్యే పెద్ద మూవీ గా “RED ” మూవీ నిలిచే అవకాశం ఉంది. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ తరువాత హీరో రామ్ నటించిన “RED ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =