‘నిశ్శబ్దం’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Read Through These Interesting Elements To Watchout In Nishabdham Movie

హేమంత్‌ మధుకర్ దర్శకత్వంలో అనుష్క కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్‌ నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఈ చిత్రం అక్టోబర్‌ 2న ప్రేక్షకులముందుకు రానున్న ఈ సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకుందాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* మొదటిది.. ఈ సినిమాలో అనుష్క నటించడం… భాగమతి తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమా ఇది. అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఈ మధ్య వస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఒకరకంగా అనుష్కనే బీజం వేసింది. అరుంధతి, రుద్రమదేవి,భాగమతి సినిమాలను బట్టి చెప్పొచ్చు అనుష్క్ ఒక్కట్టే సినిమా మొత్తాన్ని నడిపించగలదని. ఇక ఈ సినిమాలో చెవిటి మ‌రియు మూగ అమ్మాయి సాక్షి అనే ఛాలెంజింగ్ పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ఇండియ‌న్.. ఇంట‌ర్‌నేష‌న‌ల్ సైన్ లాంగ్వేజ్ ను కూడా నేర్చుకోవడం గొప్ప విషయం.

* నిశ్శబ్దం సినిమా కథ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ పెంచేలా చేసింది. తాజాగా ట్రైలర్‌ని రిలీజ్ చేయగా ఆద్యంతం థ్రిల్లర్‌, హారర్‌తో తెరకెక్కిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలను పెంచేసింది. కథ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. లొకేషన్స్ అన్నీ నిశ్శబ్దానికి కలిసొచ్చిన అంశాలు.

* ఇక షూటింగ్.. ఈ సినిమా షూటింగ్ మొత్తం అమెరికాలోనే జరగడం.. నిజానికి సినిమా మొత్తం అక్కడే షూటింగ్ అంటే ఒకరకంగా కత్తిమీదసాము లాంటిదనే చెప్పాలి. కానీ ఈ సినిమా టీం మాత్రం చాలా ఎఫర్ట్స్ పెట్టి అక్కడే షూట్ చేశారు. హైలైట్ ఏంటంటే.. సినిమా షూటింగ్‌ను 55 రోజుల్లో షూట్ ను పూర్తిచేయడం.

* మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే.. మూకీ అనుకున్న సినిమా టాకీగా మార్చడం. హేమంత్ మధుకర్ అసలు ఈ కథ రాసుకున్నప్పుడు ఏదో చిన్నగా మూకీగా తీసేద్దామనుకున్నాడట. ఐతే ఒకసారి అనుకోకుండా కోన వెంకట్‌ను కలిసినపుడు కథ చెబితే.. ఇది చాలా బాగుందని.. దీన్ని పెద్ద స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేద్దామని చెప్పాడట. ఇక వెంటనే కోన వెంకట్ కూర్చుని ఈ కథకు మాటలు రాయడం.. కాస్ట్ అండ్ క్రూను పెద్ద స్థాయిలో తీసుకోవడం జరిగిపోవడంతో పెద్ద సినిమా అయిపోయింది.

* అనుష్క-మాధవన్ కాంబినేషన్ కూడా ఈ సినిమాకు మరో హైలైట్. ఎన్నో ఏళ్ళ క్రితం వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది కూడా ఈ మధ్య ఈ వార్త జోరుగా వినిపించడంవల్లే చాలా మందికి తెలిసిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో వస్తుండటంతో.. అందులోనూ ఇద్దరూ టాలెంటెడ్ నటులు కావడంతో ఆటోమేటిక్ గా అందరికీ సినిమాపై ఆసక్తి నెలకొంది.

* మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ కాస్ట్… అనుష్క, మాధవన్ తో పాటు ఈ సినిమాలో అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు నటిస్తున్నారు. హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడ్సన్ కూడా ఈ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించడం విశేషం.

మరి ఇన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అవుతుందో లేదో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 12 =