“ఊహలు గుసగుస లాడే “, కల్యాణ వైభోగమే “, జ్యో అచ్యుతానంద “, చలో “, ఓ బేబీ “, “అశ్వద్ధామ “వంటి మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రాచీన క్రీడ ఆర్చరీ నేపథ్యంలో రూపొందుతున్న #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కై సిక్స్ ప్యాక్ అబ్స్ సాధించిన నాగశౌర్య ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాగశౌర్య గుబురు గెడ్డం, సిక్స్ ప్యాక్ లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. గత కొన్ని నెలలుగా గుబురు గెడ్డం తో ఉన్న నాగశౌర్య ఇప్పుడు ట్రిమ్ గా న్యూ లుక్ లో మారి ప్రేక్షక, అభిమానులు ఆశ్చర్యానికి గురి చేశారు. #NS20 మూవీ లో నాగశౌర్య డిఫరెంట్ లుక్స్ లో నటించనున్నారని సమాచారం. గడ్డం తో ఉన్న లుక్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు వేరే లుక్ లో నాగశౌర్య మారారు. #NS20 మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: