‘రెడ్’ సినిమా – డబ్బింగ్ పూర్తి చేసిన రామ్

Actor Ram Pothineni Wraps Up Dubbing Work For Red Movie

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ నుఇటీవలే రిలీజ్ చేయగా.. రామ్ లుక్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. రామ్ తన డబ్బింగ్ పూర్తి చేసినట్టు తన ఇన్స్టా ద్వారా తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో రామ్ కు జోడీగా నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్య‌ర్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇక స్రవంతి రవి కోశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించనున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి రావడంతో ఇప్పుడు ‘రెడ్’ సినిమా కు మంచి క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమా రామ్ కు ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.