భీష్మ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు నితిన్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగ్ దే సినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నితిన్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ను.. ప్రీ లుక్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈవిషయాన్ని నితిన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
TITLE ANNOUNCEMENT and PRE LOOK of my film with YELETI CHANDU sir wil b out tom at 4.30 p.m 😀 @BhavyaCreations @yeletics @Rakulpreet #PriyaPrakashVarrier
— nithiin (@actor_nithiin) September 30, 2020
ఈ సినిమా తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమా కూడా లైన్ లో వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































