బిగ్ బాస్ 4 – కిల్లర్ కాయిన్స్ టాస్క్ లో లొల్లి

Killer Coins Task Leads To A Scuffle Between Teams In Bigg Boss 4 Show

బిగ్ బాస్ 4 నాలుగో వారంలో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. కెప్టెన్సీ కోసం ఇంటి సభ్యులు బాగానే గేమ్ ఆడుతున్నారు. కిల్లింగ్ కాయిన్స్ అనే టాస్క్ లో కాయిన్లు సంపాదించాల‌నేది బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చిన టాస్క్. బజర్ మోగినప్పుడల్లా కాయిన్స్ వేస్తుంటే ఇంటి సభ్యులు సేకరించాలి. ఇక కిందా మీదా పడి ఎలాగోల కాయిన్స్ ను సంపాదించుకున్నారు. కొంతమంది పక్కన వాళ్లవి లాక్కున్నారు. గొడవ పడ్డారు. ఇక నిన్న రాత్రి ఎపిసోడ్ లో అయితే సోహైల్, మెహబూబ్ లు మొత్తం వేరే వాళ్ల కాయిన్స్ ను దొంగతనం చేసే పనిలో పడ్డారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అరియానా గ్లోరీ, లాస్య‌, సోహైల్ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర ఉన్న కాయిన్ల మొత్తాన్ని కొట్టేశారు. మ‌రోవైపు నోయ‌ల్, సుజాతల కాయిన్స్ కూడా మోహ‌బూబ్ కొట్టేశాడు. ఇక ఇంటి స‌భ్యులంతా రాత్రి నిద్ర‌పోతుంటే..జాగారం చేసి మ‌రీ క‌ష్ట‌ప‌డి కొట్టేసిన మెహ‌బూబ్‌, సోహైల్ అందరి కాయిన్స్ కొట్టేసారు.

ఇలా గేమ్ లో భాగంగానే బిగ్ బాస్ కాయిన్స్ వేయగా అందులో స్విచ్ కాయిన్ అనే పవర్ కాయిన్ ఉంది. ఇక మొదట అది తీసుకున్న మెహబూబ్ కింద‌ప‌డేయగా… అది సుజాత దక్కించుకుంది. అదే ముఖ్య‌మైన కాయిన్ అని బిగ్ బాస్‌చెప్ప‌డంతో తెల్ల‌ముఖం వేసిన‌మెహ‌బూబ్ ను సోహైల్ క్లాస్ పీకాడు.

ఉద‌యాన్నే త‌న కాయిన్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో మాస్టర్ సోహైల్ పై తీవ్రంగా మండిప‌డ్డాడు. ఆవేశంలో అమ్మ‌రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ కుమార్ సాయిపై త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ఇదిలా ఉంటే బ్రాండ్లు క‌నిపించ‌కుండా బ‌ట్ట‌లు ఆర‌వేస్తున్నార‌ని, వాటిని తీసివేయాల‌ని బిగ్ బాస్ లేఖ పంపించాడు. దీంతో స‌భ్యులంతా మెహ‌బూబ్‌, సోహైల్ కాయిన్ల‌పై ప‌రిచిన వ‌స్త్రాన్ని తీసేయాల‌ని గొడ‌వ‌పెట్ట‌గా..అక్క‌డ బ్రాండ్ వ‌స్తువులే లేవ‌ని గంగ‌వ్వ‌, అఖిల్ మాత్రం వారికి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో కిల్ల‌ర్ కాయిన్స్ టాస్క్ పూర్త‌యింద‌ని బిగ్ బాస్‌ప్ర‌క‌టించాడు.

మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో అవినాష్ 3160 కాయిన్లు సంపాదించ‌గా..మెహ‌బూబ్ 4360 కాయిన్స్ తో ఎక్కువ పాయింట్లు సాధించాడు. అదేవిధంగా సోహైల్ 3620, అఖిల్ 2570, స్వాతి 1930, అరియానా 1850, అభిజిత్ 1770, హారిక 1450, కుమార్ సాయి 1570, నోయ‌ల్ 900, మోనాల్ 610, దివి 110, సుజాత 340+ స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు.

ఇక రెండో రౌండ్‌లో కిల్ల‌ర్ కాయిన్ ను ఎవ‌రిపై అతికిస్తే వారి స‌గం పాయింట్లు తగ్గిపోతాయి. ఇక అందరూ సోహైల్ కు అంటించడానికి ట్రై చేస్తుంటే కాస్త అసహనం వ్యక్తం చేసాడు. ఒక‌రినే టార్గెట్ చేస్తే స్టోరీ వేరేలా ఉంట‌ది అని కూడా కోప్పడటంతో… దీంతో అమ్మ‌రాజ‌శేఖ‌ర్, సోహైల్ ఒక‌రిపై మ‌రొక‌రు అరుచుకున్నారు. ఆ త‌ర్వాత మోనాల్ ఔట‌యింది. మ‌రోవైపు అవినాష్ కింద‌ప‌డిపోయాడు. అంతా ఏమైంద‌ని అంద‌రూ ఆందోళ‌న చెంద‌గా..కాలు బెణికింద‌ని చెప్పాడు అవినాష్. దీంతో అవినాష్ ను ఇంటి స‌భ్యులు మెడిక‌ల్ రూమ్ కు ఎత్తుకెళ్లారు. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు సెలెక్ట్ అవుతారో చూడాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.