‘అల్లు స్టూడియోస్’ కు శ్రీకారం

Allu Family Inaugurates Allu Studios On Allu Ramalingaiah Birth Anniversary

తెలుగు సినీ చరిత్రలో కామెడీకి కొత్త అర్ధం చెప్పి… తన హావ భావాలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రేడు అల్లు రామలింగయ్య. కేవలం కామెడీ పాత్ర‌లు మాత్రమే కాదు విల‌న్ ప‌క్క‌న వుండే కామెడీ విల‌న్ పాత్ర‌ల్లో కూడా తన కామెడీతో నవ్వించేవారు. పాత్ర చిన్నదైనా, పెద్దదైనా సరే నవ్వులు పూయించి అలరించేవారు అల్లు రామలింగయ్య. వెయ్యికిపైగా చిత్రాల్లో అల్లు అభినయం జనానికి కితకితలు పెట్టింది. ఇప్పుడు అల్లు వారి ఫ్యామిలీ ఇంత స్థాయిలోఉండటానికి ఒకరకంగా అల్లు రామలింగయ్యే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరోజు అల్లు రామలింగయ్య 99వ జయంతి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఈ రోజు అల్లు కుటుంబ సభ్యులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంతేకాదు ఆయనకు గుర్తుగా అల్లు స్టూడియోను ప్రారంభించారు. ఈ స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియోను నిర్మించనున్నారు. ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలిపాడు.

 

ఇదిలా ఉండగా హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల స్థలంలో ఈ స్టూడియో నిర్మాణం జరగనున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీతో.. అత్యాధునిక సౌకర్యాలతో సినీ, టెలివిజన్ చిత్రీకరణకు అనువుగా ఉండేలా ఈ స్టూడియో నిర్మాణం ఉండనుందట.

కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించే ప్రయత్నంలో వున్నారు చిత్రయూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 18 =