పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ “నిశ్శబ్ధం “మూవీ అక్టోబర్ 2 వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన “నిశ్శబ్ధం “మూవీ పూర్తిగా US లో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకొనడం విశేషం. “నిశ్శబ్ధం “మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ ఇంటర్వ్యూ లో అనుష్క మాట్లాడుతూ .. “నిశ్శబ్ధం “మూవీ విశేషాలు తెలుపుతూ, యోగా గురించి కూడా చెప్పారు. యోగా అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఉపయోగపడుతుందనీ , శారీరక , మానసిక ఉల్లాసం కలిగిస్తూ యోగా భావోద్వేగాన్ని కంట్రోల్ చేస్తుందనీ, కరోనా కష్ట కాలంలో యోగా కీలకంగా మారిందనీ , కొవిడ్ -19 బాధితులకు శ్వాస కు సంబంధించిన సమస్యలు ఉంటాయనీ , అటువంటి పరిస్థితులలో యోగా ద్వారా శ్వాస సంబంధిత ఎక్సర్ సైజ్ లు చేసి కోలుకునే అవకాశం ఉందనీ , కరోనా టైమ్ లో యోగా చేస్తే సరిపోతుందని అనుకోకుండా ఎప్పుడూ చేయవల్సిందేననీ , యోగా తో శ్వాస ప్రక్రియ తో పాటు ఊపిరితిత్తులు కూడా బలంగా మారుతాయని అనుష్క చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: