ఆదివాసీలతో ‘అజ్ఞాతవాసి’ ముచ్చట

Pawan Kalyan, Pawan Kalyan Spending Some good, Pawan Kalyan Spending Some good time in between Vakeel Saaab shoot, Pawan Kalyan Vakeel Saab, Pawan Kalyan Vakeel Saab Movie News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Vakeel Saaab shoot, Vakeel Saab, Vakeel Saab Latest Update, Vakeel Saab Movie, Vakeel Saab Movie News, Vakeel Saab Movie Updates, Vakeel Saab sets Record

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించింది చిత్రయూనిట్. ముందు పవన్ లేని షాట్స్ ను కంప్లీట్ చేశారు. పవన్ కు సంబంధించి ఇంకాస్త బ్యాలన్స్ షూట్ మిగిలివుంది. ఇక పవన్ కూడా ఇటీవలే షూట్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం షూటింగ్ కోసం అరకు వెళ్ళింది చిత్రయూనిట్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా అక్కడికి వెళ్లిన పవన్ ఆదివాసీలతో కాసేపు సరదాగా గడిపాడు. షూటింగ్‌ విరామ సమయంలో ఆదివాసీల జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాట రూపంలో వారి స్థితిగతుల్ని వపన్‌కు వివరించారు. ఈ వీడియోని స్వయంగా పవన్‌ కల్యాణ్‌ సోషల్ మీడియా‌ వేదికగా తన అభిమానులతో పంచుకున్నారు. ‘నిన్న ‘వకీల్ సాబ్’ షూటింగ్ విరామంలో,అరకు ఆదివాసీలతో ముచ్చటించడం జరిగింది. ఆంధ్ర-ఒరియా లో అడవితల్లితో ముడిపడ్డ వారి జీవన స్థితిగతుల్ని వివరిస్తూ పాడిన పాట ద్వారా వారి లైఫ్ స్టేటస్ ఎలా ఉంటుందో అని తెలుసుకున్నాను.. పాట వింటుంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘ వనవాసి’ గుర్తుకువచ్చింది అని పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 3 =